మొయినాబాద్ ఫాంహౌస్ హత్యలు : వారిద్దరూ మహిళలు. ఇటీవల ఇంట్లో నుంచి (వేరువేరుగా) బయటికి వెళ్లిన వారిద్దరూ మళ్లీ ఇంటికి రాలేదు. ఏం జరిగిందో తెలియదు. కుటుంబ సభ్యులు అన్నిచోట్లా వెతికారు. బంధువులకు ఫోన్ చేసి కనుకున్నారు. అయినప్పటికీ ఉపయోగం లేదు. చివరికి వారు వినకూడని వార్త విన్నారు. జరగకూడని దారుణాన్ని చూశారు.
తెలంగాణ రాష్ట్రంలో తాండూరులో ఇద్దరు మహిళలు కనిపించకుండా పోయారు. వారిద్దరూ వృద్ధులే. చివరికి వారు విగత జీవులుగా మారారు. బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఒకరు.. యాలాల్ పరిధిలో మరొకరు అదృశ్యమయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ట ప్రాంతంలో వారిద్దరి విగత దేహాలు కనిపించాయి. అయితే వారిద్దరిని తాండూర్ నుంచి మొయినాబాద్ తీసుకొచ్చి.. అక్కడ ఎవరూ లేని ప్రదేశంలో దారుణానికి పాల్పడ్డారని.. తర్వాత వారి విగతదేహాలను పూడ్చిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
చనిపోయిన వారిలో బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడి ఆయా ఆబేద, తాండూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబ్ బేగం గా పోలీసులు పేర్కొన్నారు. అయితే నిందితులు ఒకేసారి ఈ ఘోరానికి పాల్పడ్డారు. సరిగ్గా రెండు నెలల క్రితం ఒక వృద్ధురాలు అంతం చేశారు. ఆమె విగత దేహాన్ని పూడ్చిపెట్టారు. అనంతరం మరో వృద్ధురాలుని కూడా ఐదు రోజుల క్రితం అంతం చేశారు. ఆమె మిగిలినదేహాన్ని కూడా అలానే పూడ్చిపెట్టారు.
ఈ వ్యవహారంలో చనిపోయిన ఒక మహిళ భర్త హస్తంతో పాటు.. స్థానికంగా ఒక ఫామ్ హౌస్ సెక్యూరిటీ గార్డ్ గా వ్యవహరించిన వ్యక్తి పాత్ర ఉందని పోలీసులు పేర్కొన్నారు. వారిని అంతం చేసిన తర్వాత విగత దేహాలను మోయినబాదులోని ఓ వ్యవసాయ క్షేత్రం వెనుక వైపు ఉన్న ప్రాంతంలో పూడ్చిపెట్టారు.. అయితే వారిని ఎందుకు అంతం చేశారు?.. డబ్బు కోణంలోనా? ఇంకా మరి ఏదైనా కారణం ఉందా? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

