Motorola Razr ఫోల్డ్ కొత్త స్మార్ట్‌ఫోన్: Motorola తన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Motorola Razr Foldnu మే 20, 2026న భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదలైంది. అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Gen 5ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్, ఫోల్డబుల్ ఫోన్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 3nm ఆర్కిటెక్చర్‌తో రూపొందించబడిన ఈ చిప్సెట్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా వినియోగదారులకు మునుపెన్నడూ లేని విధంగా వేగవంతమైన, స్మార్ట్ AI అనుభూతిని పొందుతోంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Motorola Razr Fold ఫోన్ రెండు అద్భుతమైన డిస్ప్లేలతో వస్తోంది. బయట వైపు 6.6 ఇక్కడ ఎక్స్ట్రీమ్ AMOLED స్క్రీన్ ఉండగా.., లోపల 8.1 2K భారీ డిస్ప్లే ఉంటుంది. ఇది 6200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉండి, ఎండలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విమాన తయారీలో వాడే స్టీల్ హింజ్ మరియు టైటానియం రీన్ఫోర్స్మెంట్ వల్ల ఈ ఫోన్ చాలా దృఢంగా ఉంటుంది.
ఈ మొబైల్లో అత్యుత్తమ ఫోల్డబుల్ కెమెరా సిస్టమ్‌ను చూడొచ్చు.50MP సోనీ LYTIA 828 సెన్సార్ కలిగిన ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్‌తో పనిచేస్తుంది. 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారితోపాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టించిన వారికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో బలమైన బ్యాటరీ వ్యవస్థను కూడా చూడొచ్చు. ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన ఫోల్డబుల్ ఫోన్లలో లేని అతిపెద్ద 6000mAh సిలికాన్ బ్యాటరీ బ్యాటరీని అందించారు. దీనికి 80W టర్బో ఛార్జింగ్ , 50W వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
భారత్‌లో ఈ ఫోన్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: 12GB + 256GB వేరియంట్ కలిగిన మొబైల్ ధర రూ. 1,49,999 గా ఉంది.16GB + 512GB మోడల్ ను రూ.1,59,999 తో విక్రయిస్తున్నారు.ఈ మొబైల్ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ డిస్కౌంట్లతో ప్రారంభ ధర రూ.1,39,999 కే లభిస్తుంది. అలాగే, జూన్ 20 లోపు కొనుగోలు చేసే వారికి ఒకసారి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్మెంట్(విలువ ₹57,000) చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. గేమింగ్ కోసం లేదా మంచి కెమెరా కోసం ఫోన్ కొనాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

