మోడీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ : కేంద్ర కేబినెట్లో త్వరలో భారీ మార్పులు జరగబోతున్నాయా? ప్రస్తుతం మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి.. యూఏఈ, నెదర్లాండ్ లతో ఒప్పందాలు దేశానికి ఎంతో ఉపయోగం కానున్నాయి. అన్నీ చోట్ల రూమర్స్ వస్తున్నాయి. కేంద్ర కేబినెట్లో మార్పులు వస్తాయని.. అన్నామలై రాజ్యసభతోపాటు కేంద్ర కేబినెట్లో చేరుతారని టాక్ నడుస్తోంది.
మోడీ 2014లో , 2019లో వచ్చినా ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే.. సగం కాలం పూర్తయ్యాక అంటే రెండేళ్ల తర్వాత మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ చేసి ఎవరు ఏ మంత్రి ఎలా చేస్తారని చూసి కేబినెట్ రీషఫల్ చేస్తారు. ఈ సారి కూడా ఆలోచిస్తానని బలంగా వినిపిస్తోంది.
ఈ నెల 21వ తేదీన కేంద్రమంత్రుల శాఖల రిపోర్టు కార్డ్ ప్రజెంటేషన్ ఉంది. కేంద్రమంత్రుల పనితీరుపై రివ్యూ తర్వాత జరుగుతుంది. ఇక రెండోది రెండు సంవత్సరాల్లో వచ్చిన డెవలప్ మెంట్స్ చూసి మంత్రివర్గ ప్రక్షాళన చేయనున్నారు. వచ్చే యూపీ సహా కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేబినెట్ రీషఫుల్ చేస్తారు. కీలకమైన పెద్ద మంత్రుల శాఖల మార్పులుండవు. విదేశీ, ఆర్థిక , రక్షణ, రోడ్డు రవాణా వంటి వాటిల్లో మార్పులుండవు.
త్వరలో మోడీ కాబినెట్ లో మార్పులు చేర్పులు .. సమీక్ష ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియో చూడొచ్చు.

