– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్ : మోడీ ప్రభుత్వంలోని అవినీతి అక్రమాలపై సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో గతంలో ప్రధాని మోడీ ఇచ్చిన నినాదం తాను, ఇతరులను కూడా తిననివ్వను అనేది ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ”మోడీ పాలనలోనే అయోధ్య రామమందిరానికి సమర్పించిన కోట్లాది రూపాయల విరాళాలు దొంగతనంగా భక్తులు చూస్తున్నారు. మోడీ పాలనలోనే ఒక సహాయ మంత్రి రైతులకు ఉద్దేశించిన ప్రభుత్వ రాయితీ పథకంలో కోటి రూపాయలను దోచుకున్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు వందలాది ఎకరాల భూములను కూడబెట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ గతంలో ఇచ్చిన “నేను.. ఇతరులను కూడా తిననివ్వను” అనే నినాదం ఈ శతాబ్దపు అతిపెద్ద హాస్యాస్పదమైన వ్యాఖ్య” అని ఎక్స్పోస్ట్లో పేర్కొన్నారు.
– ప్రకటన –

