Diamond Import Duty India: బంగారానికి భారతీయులకు విడదీయరాని బంధం ఉంటుంది. బంగారం మన అవసరాలకు సరిపడా ఉత్పత్తి కాదు. అందువల్లే విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కోసం ఆ స్థాయిలో మన దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చుపెట్టే స్థాయి లేకపోవడంతో.. పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. బంగారం మీద సుంకాన్ని పెంచేసింది. దీంతో బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి.
బంగారం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు డైమండ్స్ మీద తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.. ఎందుకంటే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ డైమండ్ కన్జ్యూమర్ కాంట్రీగా ఇండియా సాధించింది. ఇప్పటివరకు చైనా, జపాన్ దేశాల తర్వాత భారత్ ఉండేది. వజ్రాల వినియోగంలో అమెరికా మొదటి స్థానంలో. అయితే ఇటీవల డి బీర్స్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం దేశంలో న్యాచురల్ డైమండ్ మార్కెట్ ఏకంగా 12 శాతం పెరిగింది. జెన్ జడ్ యువత.. ఇండిపెండెంట్ ఉమెన్స్.. యువకులు ఎక్కువగా వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. వాటిని ధరించడం స్టేటస్ సింబల్ గా. వివిధ రకాలైన వజ్రాలను దిగుమతి చేసుకొని.. ఆభరణాలుగా రూపొందిస్తున్నారు.
వజ్రాల హారాలు.. వజ్రాలతో పొదిగిన ఉంగరాలు.. వజ్రాల తో రూపొందించిన లాకెట్లు ధరిస్తున్నారు.. వీటి కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. అందువల్ల వజ్రాల జపాన్ వినియోగంలో భారత్ ఏకంగా చైనా, దేశాలను దాటేసింది. ఇప్పుడు నెంబర్ 2 స్థానంలోకి వచ్చేసింది. ఇదే స్థాయిలో దిగుమతులు కనుక కొనసాగితే భారత్ కచ్చితంగా అమెరికా దేశాన్ని దాటుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మనదేశంలో వజ్రాలను సానపెట్టే ప్రక్రియ గుజరాత్ రాష్ట్రంలో సూరత్ నగరంలో ఎక్కువగా సాగుతూ ఉంటుంది. ఇక్కడ గతంలో సాన పెట్టిన వజ్రా ఇతర దేశాలకు విమర్శించేవారు. ప్రస్తుతం మనదేశంలోనే ఎక్కువగా వినియోగం అవుతున్నాయి.
వజ్రాలను కూడా రకరకాలైన వాటిని భారతీయులు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పింక్.. గోల్డెన్.. వైట్ డైమండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. హై ప్రొఫైల్ వ్యక్తులు ఎక్కువగా వజ్రాలను ధరిస్తున్నారు. ఇటీవల జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో.. మెట్ గాలాలో వజ్రాలతో రూపొందించిన ఆభరణాలను సెలబ్రిటీలు ధరించారు. అమెరికా సెలబ్రిటీలను మించి ఇండియన్ సెలబ్రిటీలు డైమండ్ జ్యువెలరీ ధరించారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వజ్రాల డిమాండ్ ఇలాంటివి కొనసాగితే బంగారం లాంటి వాటి మీద కూడా సుంకాన్ని భారత ప్రభుత్వం విధించే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

