- భారత కీలక పాత్రపై మోహన్ భగవత్ వ్యాఖ్యలు
- ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం
- హాని చేయాలనే లక్ష్యంతో కాదని హితవు
భారత భవిష్యత్ పాత్రపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం అని తెలియజేసారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. తమ దగ్గర సత్యం మాత్రమే ఉంటే సరిపోదని.. ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరమని హితవు పలికారు. అయితే ఒక విషయం ఏంటంటే.. భారత్ ఎవరికీ హాని చేయాలనే లక్ష్యంతో కాకుండా ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే దేశంగా ఎదగాలని సూచించారు.
“ప్రపంచం శక్తివంతుల మాటనే ఎక్కువగా వింటుంది. సత్యం ఒక్కటే సరిపోదు. బలం ఉన్నవారికే గౌరవం లభిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. శక్తివంతమైన దేశాలు తమ ఇష్టానుసారంగా ఉన్నాయి. ఒక దేశాన్ని ఆక్రమించడం, బాంబులు వేయడం, చమురు సరఫరా చేయడం వంటి చర్యలన్నీ జరుగుతున్నాయి. బలహీన దేశాలు వాటికి తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది” అని అన్నారు.
అలా చేయొద్దు
అయితే భారత్ మాత్రం చేయొద్దని.. అలాంటి లక్ష్యం వద్దని.. ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించమని చెప్పడం తన ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. “భారత్ ఎవరినీ అణచివేయాలని కోరుకోవడం లేదు. అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్లాలని.. ప్రపంచానికి మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను. తన సొంత విలువలు, సూత్రాల ఆధారంగా బలమైన దేశంగా ఎదిగితే ప్రపంచానికి కొత్త దారి చూపుతుంది” అని అన్నారు. సమాజాన్ని సద్గుణాలు కలిగిన వ్యక్తులు తీర్చిదిద్దినప్పుడే దేశం నిజమైన శక్తిగా అవతరిస్తుందని సూచిస్తుంది. ఆధ్యాత్మిక విలువలు, ధర్మబద్ధమైన జీవన విధానంతో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని.. ఆధిపత్యం ద్వారా కాకుండా ధర్మం, నైతికత ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేసే దేశంగా ఎదగాలని మోహన్ భగవత్ ఆకాంక్షించారు.
#చూడండి | నాగ్‌పూర్ | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇలా అన్నారు, “ప్రపంచం శక్తి ఉన్నవారి మాట వింటుంది కాబట్టి మనం మన దేశాన్ని సుసంపన్నం చేయాలనుకుంటున్నాము; సత్యం ఒక్కటే సరిపోదు, బలం మాత్రమే గౌరవాన్ని ఇస్తుంది; బలహీనులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తారు, బలహీనులు తలవంచాలి, … pic.twitter.com/uz73UgNOQs
– ANI (@ANI) జూన్ 4, 2026

