తెలంగాణ:సూర్యాపేట యర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు మరోసారి రక్తపాతానికి దారితీశాయి.బీఆర్ఎస్ నాయకుడు,మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును(చింతలపాటి మందు) గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది.
స్థానికుల సమాచారం ప్రకారం…శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మధును హత్య చేసిన దుండగులు అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి యర్కారం స్టేజీ సమీపంలో పడేసి పరారయ్యారు.ఉదయం అక్కడికి వెళ్లిన గ్రామస్తులు గొనె సంచిలో మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి చేరుకున్నారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
ఘటనతో యర్కారం గ్రామంలో( యెర్కరం ) ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ నరసింహా ఎత్తులో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.గ్రామంలో పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్న పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

