విశాలాంధ్ర – యాడికి..యాడికి మండల శివారులోని గుత్తి రోడ్డులోని జూనియర్ కళాశాల సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది.స్థానికుల వివరాల మేరకు బైక్ అదుపుతప్పి బోల్తా పడడంతో కిష్టిపాడుకు చెందిన తండ్రీ కొడుకులు మురళీ మోహన్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.వీరు యాడికి జరిగిన ఓ ఫంక్షన్కు వెంటనే హాజరై స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో మార్గమధ్యంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం. వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

