కొత్తగా యాపిల్ ప్రొడక్ట్స్ కొనాలని అనుకునేవారికి ఇది చేదు వార్తే. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన మ్యాక్ బుక్, ఆప్యాడ్ మోడల్ ధరలను ఏకంగా 20 నుంచి 42 శాతం వరకు పెంచేసింది. ఇండియాలో కూడా ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఉదాహరణకు M5 ప్రో చిప్ తో వచ్చే 14 మ్యాక్ బుక్ ప్రో లాంచ్ ప్రైస్ దాదాపు రెండున్నర లక్షలు ఉండగా, ఇప్పుడు అది ఏకంగా మూడు లక్షలకు చేరింది. ఇక ఐప్యాడ్ ఎయిర్ బేస్ మోడల్ ధర కూడా 84 వేల నుంచి లక్ష ఇరవై వేలకు పెరిగిపోయింది.
అసలు రేట్లు ఇంత దారుణంగా ఎందుకు పెరిగాయంటే, దీని వెనుక కృత్రిమ మేధ డేటా సెంటర్ల హవా ఉంది. ఈ ఐఐ డేటా సెంటర్ల కోసం మెమరీ, స్టోరేజ్ చిప్‌లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనివల్ల సెమీకండక్టర్ల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటివరకు ఈ భారాన్ని కస్టమర్ల మీద పడకుండా తామే చేస్తామని, కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వస్తోందని యాపిల్ యాజమాన్యం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వినియోగదారులకు నిరాశ కలిగిస్తుందని తెలుసు, అయినా వేరే దారి లేదని కంపెనీ చెప్పుకొచ్చింది.
ధరల పెంపు ప్రకటన రాగానే మార్కెట్లో యాపిల్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఏప్రిల్ తర్వాత ఎన్నడూ లేని విధంగా షేర్ వాల్యూ దాదాపు ఆరు శాతం మేర పడిపోయింది. నిజానికి మెమరీ చిప్‌ల కొరత తీవ్రంగా ఉండబోతోందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గతంలోనే తెలిసింది. ఈ చిప్ షార్టేజ్ వల్ల ఇప్పటికే కొన్ని మ్యాక్ మోడల్స్ తయారీ, డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన గుర్తించారు. ఈ ఇబ్బందులు ఇప్పుడు తీరేలా లేవని, రాబోయే కొన్ని నెలల పాటు ఈ కొరత ఇలాగే కొనసాగుతుందని అన్నారు.
ప్రస్తుతానికి ఐఫోన్, ఆపిల్ వాచ్, ఎయిర్‌ప్యాడ్స్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ భవిష్యత్తులో వాటి రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాబోయే ఐఫోన్ 18 సిరీస్‌లో ప్రోమోడళ్ల ధరలు భారీగా ఉండొచ్చని తెలుస్తోంది. కెమెరా విడిభాగాల ఖర్చు పెరగడం ప్రో మోడళ్లపై కనీసం వంద డాలర్ల భారం పడే ఛాన్స్ ఉంది. ఇక నుంచి ఆపిల్ ప్రొడక్ట్స్ వాడే సామాన్య వినియోగదారుల జేబులకు మాత్రం ఈ నిర్ణయం వల్ల పెద్ద చిల్లు పెట్టినట్లే.

