- దేశంలో కొనసాగుతున్న రాజకీయ ఫిరాయింపులు
- సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి
- కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
- యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
దేశంలో ప్రస్తుతం ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి భారీ చీలిక జరిగింది. అనంతరం మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు చెందిన ఎంపీలు షిండే వర్గంలో చేరేందుకు అయ్యారు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ వంతు వచ్చింది. యూపీలో కూడా సమాజ్‌వాదీ పార్టీ నుంచి భారీ చీలిక జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. మొత్తం ఎంపీలంతా బీజేపీ వైపు చూస్తున్నట్లుగా మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలిక తప్పదని.. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే బీజేపీ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రపైనే దృష్టి పెట్టొద్దని.. ఇప్పుడు యూపీ వంతు వచ్చిందంటూ. ఏఎన్ఐతో మంత్రి మాట్లాడుతూ.. ”ఎవరైనా కొనడానికి సిద్ధంగా ఉంటే ఎవరైనా కొనుగోలు చేస్తారు. మహారాష్ట్ర గురించే కాకుండా ఉత్తరప్రదేశ్‌పై కూడా దృష్టి పెట్టండి” అని అన్నారు.
ఇటీవల తృణమూల్ కాంగ్రెస్‌లో కొందరు ఎంపీలు తిరుగుబాటు చేశారనే వార్తలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే అనుమతిని శివసేన (యూబీటీ)కి చెందిన పలువురు ఎంపీలు ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరిన ప్రచారం. ఈ పరిణామాల మధ్య ఓపీ రాజ్‌భర్ చేసిన వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. అయితే సమాజ్‌వాదీ పార్టీ ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
సమాజవాది పార్టీ లో బడ్డీ టూట్ హోగీ. రామ్ గోపాల యాదవ్ నే కేంద్ర గృహమంత్రీ అమిత్ షా జి కో చిత్తి సౌంపి.
ఖనన్ ఘోటాల మరియు గోమతి రివర్ ఫ్రంట్ ఘోటాల కా మాస్టర్‌మైండ్ కౌన్ పహై, ప్రదేశ్ జానత ఉంది. శికంజా కస రహా హే తో సప పరేషాన్ ఉంది.
మహారాష్ట్ర బంగాళా ఛోడియే, సమూచి సాపా, భాజపాలో…
– ఓం ప్రకాష్ రాజ్‌భర్ (@oprajbhar) జూన్ 17, 2026

