- ఐరోపా దేశాలను దంచికొడుతున్న ఎండలు
- తీవ్రమైన ఉక్కపోత, చెమటలతో హడల్
- కరిగిపోతున్న సంస్థలు.. వంకర ట్రామ్ పట్టాలు
ఐరోపా దేశాలను మునుపెన్నడూ లేనంతగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే సుర్రుడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత, చెమటలతో అల్లాడుతున్నారు. దీంతో నడుస్తోంది.. ట్యాంక్‌ల దగ్గర స్నానాలు చేస్తూ సేదతీరుతున్నారు. ఇక తాజాగా. ట్రామ్ పట్టాలు వంకర తిరుగుతున్నాయి. అధిక సంఖ్యలో వేలాది మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 21 నుంచి ఇప్పటివరకు యూరప్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 1,300 మందికి పైగా అదనపు మరణాలు నమోదయ్యాయి. కార్లలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు, వేడి నుంచి ఉపశమనం కోసం నీటి ప్రాంతాలలో ఈతకు వెళ్లి మునిగిపోయిన యువకులు కూడా ఉన్నారు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో హీట్‌వేవ్ కారణంగా మరణాల సంఖ్య పెరగడంతో మార్పులు, అంత్యక్రియల కేంద్రాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జూన్ 18 నుంచి ఇప్పటివరకు ఫ్రాన్స్‌లో కనీసం 74 మంది నీటిలో మునిగి మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి కొంత తగ్గినా, జూలైలో మరోసారి తీవ్రమైన హీట్‌వేవ్ వచ్చే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ యూరప్‌లో ప్రారంభమైన ఈ హీట్‌వేవ్ ప్రస్తుతం తూర్పు యూరప్‌కు విస్తరించింది. పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ దేశాల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి.
తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని హంగేరీ ప్రభుత్వం సూచించింది. అలాగే బహిరంగ పనుల సమయాలను మార్చాలని, రెస్టారెంట్లు ఉచితంగా తాగునీరు అందించాలని, ఎయిర్ కండీషన్ ప్రజా కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థపై హీట్‌వేవ్ మరింత భారం మోపింది. 35 డిగ్రీల నుంచి 38 వరకు ఉష్ణోగ్రతలు నమోదవ వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అత్యవసర విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు.
తీవ్ర ఎండల ప్రభావం చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో బయట ఎండలో ఉంచిన పాన్‌పై కొద్ది నిమిషాల్లోనే గుడ్లు, బేకన్ ఊడికిపోవడం కనిపించింది. జర్మనీలో కంపెనీలు కరిగిపోవడం, ట్రామ్ పట్టాలు వేడికి వంకర తిరగడం వంటి దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. అలాగే బెర్లిన్‌లో ప్రజలను చల్లబరచేందుకు పోలీసులు వాటర్ కానన్లతో నీటి జల్లులు చల్లగా, స్థానికులు వాటి కింద విశ్రాంతి పొందిన దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నారు.
🥵 పోలాండ్‌లో చాలా వేడిగా ఉంది, ప్రజలు ఆరుబయట గుడ్లు వేయించుకుంటున్నారు
వార్సాలో, ఒక మహిళ ఎండలో వేయించడానికి పాన్ వదిలి, కొంతకాలం తర్వాత, దానిపై గుడ్డు వండింది.
పోలాండ్ విపరీతమైన హీట్‌వేవ్‌లో ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40°Cకి చేరుకుంటాయి. ప్రకాశవంతమైన వైపు, మీరు… pic.twitter.com/YKzKdUZhft
— NEXTA (@nexta_tv) జూన్ 28, 2026
🌡 విపరీతమైన వేడి కారణంగా జర్మనీలోని లీప్జిగ్లో అన్ని ట్రామ్‌లు నిలిచిపోయాయి
విపరీతమైన వేడి కారణంగా తారు మరియు కాంక్రీటు మధ్య సీలెంట్ కరిగిపోయింది. ఇది ట్రామ్ ట్రాక్‌లలోకి ప్రవేశించి గట్టిపడింది, ట్రామ్ కార్యకలాపాలు సురక్షితం కాదు.
నగరం అంతటా అన్ని ట్రామ్ సేవలు కనీసం వరకు నిలిపివేయబడ్డాయి… pic.twitter.com/5vOzn7ihNx
— NEXTA (@nexta_tv) జూన్ 28, 2026
🥵 జర్మనీ వేడికి అక్షరాలా కరిగిపోతోంది
లీప్జిగ్లో, విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా ట్రామ్ ట్రాక్‌ల చుట్టూ ఉపయోగించే సీలెంట్ కరిగిపోయింది. ఇది పట్టాలు మరియు ట్రాక్ స్విచ్లలోకి చొచ్చుకుపోయి పెద్ద గుబ్బలుగా గట్టిపడుతుంది.
రికార్డు స్థాయి హీట్‌వేవ్ జర్మనీకి చేస్తున్నది ఇదే👇 pic.twitter.com/LfbLkCRGml
— NEXTA (@nexta_tv) జూన్ 29, 2026
వాతావరణ మార్పులకు వారు తమ ప్రధానమంత్రి/అధ్యక్షుడిని నిందిస్తున్నారా? pic.twitter.com/Ixu3nqRud4
– మిస్టర్ సిన్హా (@Mrsinha) జూన్ 29, 2026

