రిటైర్డ్ కంటి జిల్లా అంతత్వ అధికారి సంకారపు నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం: రక్తపోటు నియంత్రణపై అవగాహన అందరికీ ఉండాలని రిటైర్డ్ కంటి జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ రక్తపోటు నియంత్రణపై అవగాహన మాసోస్తవం పురస్కరించుకొని పలు విషయాలు తెలియజేసారు. మనిషిని నిశ్శబ్దంగా దెబ్బతీసేది అధిక రక్త పోటూ అని తెలియజేశారు. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా మనిషి జీవితాన్ని దెబ్బ తీస్తుందని . ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా చెకప్ లు రక్తపోటు స్క్రీనింగ్ చాలా ముఖ్యమని తెలియజేశారు. ఆరోగ్యంగానే ఉన్నామని భావించి చెకప్ లను విస్మరిస్తే ఒక్కోసారి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులకు ప్రమాదం ఉంది.
అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు పక్షవాతం వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుందని తెలియజేశారు. హై బీపీ సమస్యలను తేలికగా తీసుకోకూడదనీ ఇది దీర్ఘకాలిక సరైన ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలి తగిన మందుల సహాయంతో హై బీపీ సమస్యను తగ్గించుకోవచ్చు అన్నారు. బీపీ పెరిగితే గుండె ఎక్కువగా పని చేస్తుంది అని , దీని వల్ల శ్వాస ఆడక పోవడం జరుగుతుందని. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం సంతృప్త కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలన్నారు. పానం, బీడీ సిగరెట్ గుట్కా పాన్, కైని, జర్ధా వాటికీ దూరంగా ఉండాలని మద్య ఉంది.

