భంక్రా మసీదు: సమర్ధుడైన వారికి అధికారం ఇస్తే జరుగుతుందో పశ్చిమబెంగాల్లో ఏం ప్రారంభమైంది. అక్కడ మార్పు అనేది ఎందుకు మరుగున పడిపోయింది.. ఇప్పుడు అభివృద్ధి నుంచి మొదలు పెడితే సంక్షేమ పథకాలు ఎందుకు సక్రమంగా అందుతున్నాయి.. లా ఆర్డర్ ఎందుకు అంతంత మాత్రంగానే పనిచేస్తోంది.. అక్రమార్కులు.. చొరబాటుదారులు ఎందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతున్నారు.
సుబేందు మమతా బెనర్జీ ప్రభుత్వంలో పని చేసినవాడు. కాకపోతే ఆమె నిర్ణయాలు సరిగా లేకపోవడంతో బయటకు వచ్చాడు. అతనికి బిజెపి అవకాశాలు ఇచ్చింది. సక్రమంగా వాడుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత అతడిని ముఖ్యమంత్రి చేసింది. అధిష్టానం ఇచ్చిన బాధ్యతను సుబేందు అధికారి సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు.
ఇప్పటికే అనేక సంచలన నిర్ణయాలు తీసుకొని నిత్యం జాతీయ మీడియాలో నానుతూ ఉన్న సుబేందు అధికారి.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.. రాజధాని కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఉన్న భాంక్ర మసీద్ (దీనిని గౌరీపూర్ మసీదు) వద్ద నమాజ్ నిషేధిస్తూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మసీదు విమానాశ్రయం రన్ వేకు చాలా దగ్గరగా ఉంది. మసీదులో లైట్లు.. నమాజ్ కోసం ఏర్పాటుచేసిన జలశయం విమానాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తుంది.. ఇది అత్యంత ప్రమాదకరమని ప్రభుత్వం భావించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉండే విమానాశ్రయంలోకి అనధికారిక వ్యక్తులు రావడాన్ని బెంగాల్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అక్కడ నమాజ్ చేయడానికి ప్రభుత్వం నిషేధించింది.
మసీదును మరో సురక్షితమైన ప్రదేశానికి తరలించనుంది. అక్కడ మెరుగైన సౌకర్యాలతో పునర్నిర్మించనుంది. ఇదే కాకుండా విమానాశ్రయ రన్ వే నాలుగు రెట్లు పెంచుతుంది. తూర్పు భారతదేశంలోని ప్రధానమైన హబ్ గా ఉన్న కోల్‌కతా విమానాశ్రయ భద్రతను ఉత్పత్తి చేయడంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కీలకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనధికారిక వ్యక్తులు ఇకపై ఈ విమానాశ్రయంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. మసీద్ తరలింపు ప్రత్యేక కూడా వేగంగా జరుగుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రత్యామ్నాయ అధికారులు చూశారని.. త్వరలోనే నిర్మాణ పనులు కూడా మొదలవుతాయని బెంగాల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

