గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం జరిగిన మంత్రి నారా లోకేశ్ అన్నారు. తిరుపతిలో జరిగిన కూటమి సభలో ఆయన మాట్లాడుతూ విధ్వంసం నుంచి రాష్టాన్ని అభివృద్ధిలోకి తీసుకు వస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో తీసుకెళుతున్నామని చెప్పారు. ఈ రెండేళ్ల పాలనలో జేసీబీలు, హత్యలు, దాడులు, బూతులు లేకుండా సాఫీగా సాగుతుందని అన్నారు.
గొడ్డలి పార్టీ అరాచకాలకు గత ఎన్నికల్లో ప్రజలు చెక్ పెట్టారని అన్నారు. తల్లిని చల్లిని మోసం చేసిన ఘనత, తన డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన చరిత్ర గత వైసీపీ ప్రభుత్వానిదేనని అంటున్నారు. అందుకే గత ఎన్నికల్లో పదకొండు సీట్లు ఇచ్చాం. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకునేది లేదని.. ఎర్రబుక్కు దాని పని అది చేసుకుంటూ పోతుందని. మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.

