రవితేజ: మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యకాలంలో డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. ఒకానొక సందర్భంలో కమర్షియల్ సినిమాలను నమ్ముకునే ముందుకు సాగిన ఆయన ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ సినిమాతో కొత్త ప్రయోగం చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే కెరియర్ స్టార్టింగ్ లో రవితేజను స్టార్ హీరోగా నిలిపిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ సినిమాలు రావడంతో రవితేజ స్టార్ హీరోగా మారిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు రవితేజ మరోసారి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేస్తే బాగుంటుందని మరి కొందరు.
ఇక పూరి జగన్నాధ్ తో ఆయన సినిమా చేస్తే వీళ్ళిద్దరి కాంబినేషన్ మరోసారి బాగా వర్కౌట్ అవుతుందని చాలామంది తెలుసు. నిజానికి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి 10 సంవత్సరాల వరకు అవుతుంది. మరి ఇలాంటిదే ఇప్పుడు కలిసి వీళ్ళిద్దరు సినిమా చేస్తే బాగుంటుంది కదా అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
సినిమా మేధావులు సైతం రవితేజ పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఎప్పటికీ ఎవరి గ్రీన్ అని వాళ్ళ కాంబినేషన్లో హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వాళ్ళిద్దరి మధ్య ఉండే ర్యాపో తో ఒక మంచి సినిమా అయితే వస్తుందని. ఇక పూరి జగన్నాధ్ గతంలో లాగా ఇప్పుడుఫామ్ లో లేడు. అయినప్పటికి రవితేజ దొరికితే తను కచ్చితంగా హిట్ సినిమా తీస్తాడని మరి కొందరు. ఇక పూరి ఇప్పుడు మరోసారి తన సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది…
ఇక ఇలాంటిదే రవితేజ సైతం ప్రస్తుతం కొత్త సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. కాబట్టి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా చేయడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే పూరి జగన్నాధ్ రొటీన్ టెంప్లేట్ లోనే సినిమాలు చేస్తుంటాడు. కాబట్టి వీళ్లిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడప్పుడే ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు లేవు…

