- రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం
- హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిందే
- మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ యుద్ధం ఇప్పుడు రెండో ప్రపంచ కంటే ఎక్కువ కాలం కొనసాగింది. ఇక దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధాన్ని ముగించడానికి సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించడానికి అమెరికా సిద్ధంగా ఉంది” అని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ స్థాయిలో తీవ్ర ప్రభావం చూపుతోంది. శాంతి చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాలకు అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని రూబియో స్పష్టం చేశారు.
అలాగే “సముద్ర జలసంధులు ఎప్పటికీ తెరిచి ఉండాలి. అక్కడ జరుగుతున్నది భయంకరమైనదే కాకుండా పూర్తిగా చట్టవిరుద్ధం. ఇది ప్రపంచానికి అస్థిరతను తెస్తోంది.. అసలు అంగీకరించలేని పరిస్థితి” అని హార్ముజ్ గురించి ప్రస్తావించారు. ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలకు కీలకమైన సముద్ర మార్గాల్లో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సముద్ర రవాణా అంతరాయాలు లేకుండా కొనసాగాలని, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
నాలుగు రోజుల పర్యటన కోసం మార్కో రూబియో గత శనివారం భారత్‌కు వచ్చారు. శనివారం కోల్‌కతాలో అడుగుపెట్టిన ఆయన ఛారిటీ ఆఫ్ మిస్సనరీష్ను సందర్శించారు. అనంతరం ఢిల్లీ చేరుకుని ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. అనంతరం రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఇక ఆదివారం జైశంకర్‌తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడుకున్నారు. ఇక సోమవారం తాజ్‌మహల్, జైపూర్ ప్రాంతాలను సందర్శించారు. ఇక మంగళవారం క్వాడ్ విదేశాంగ దేశాల సందర్భంగా.
#చూడండి | రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై, US సెక్రటరీ ఆఫ్ స్టేట్, మార్కో రూబియో ఇలా అన్నారు, “…ఇది ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ కాలం కొనసాగింది మరియు ఇది ముగింపుకు రావాలి. ఈ యుద్ధాన్ని ముగించడంలో సహాయం చేయడానికి మేము చేయగలిగినదంతా చేయడానికి US సిద్ధంగా ఉంది మరియు సిద్ధంగా ఉంది…”
(వీడియో: US డిపార్ట్మెంట్ ఆఫ్… pic.twitter.com/CQnCjkbKpI
– ANI (@ANI) మే 26, 2026
#చూడండి | US సెక్రటరీ ఆఫ్ స్టేట్, మార్కో రూబియో, “జలసంధి బహిరంగంగా ఉండాలి… అక్కడ జరుగుతున్నది భయంకరమైనది మరియు చట్టవిరుద్ధం. ఇది ప్రపంచానికి భరించలేనిది మరియు ఇది ఆమోదయోగ్యం కాదు…”
(వీడియో: US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్/X) pic.twitter.com/JLtkLiscqj
– ANI (@ANI) మే 26, 2026

