ఇటీవల: రష్యా ఆయిల్ కొనుగోళ్ల విషయంలో అమెరికా ఆంక్షలను ఇండియా లైట్ తీసుకుంది. అమెరికా ఆంక్షల గడువు ముగిసినప్పటికీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆగవని తేల్చిచెప్పింది. రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు యధావిధిగా కొనసాగాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ఇంధన విధానం, ధరలు, సరఫరాపైనే దృష్టి సారిస్తుంది. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో దేశ ప్రయోజనాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని.
కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని ప్రపంచ దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. తమ మాట లెక్క చేయకుండా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించాడు. దీంతో ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను తగ్గించింది. అయితే, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ప్రపంచ ఇంధన సంక్షోభం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లపై విధించిన ఆంక్షలను నెల రోజుల పాటు అమెరికా సడలించింది. ఈ గడువు సోమవారం (18)తో ముగిసింది. దీంతో రష్యా ఆయిల్ కొనుగోళ్లపై ఆంక్షలు మళ్లీ అమల్లోకి వచ్చాయి. కానీ రష్యా ఆయిల్ కొనుగోళ్లపై అమెరికా విధించిన ఆంక్షల మినహాయింపు ముగిసినప్పటికీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు ఇండియా ప్రకటించింది. భారత్ నిర్ణయంపై అమెరికా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
రష్యా చమురు సరఫరా స్థిరంగా ఉంది: సుజాత శర్మ
రష్యా ఆయిల్ కొనుగోళ్లపై పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. రష్యా నుంచి చమురు సరఫరా స్థిరంగా ఉందని తెలిపారు. అమెరికా ఆంక్షలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేశామని.. భవిష్యత్‌లోనూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగించాలని నిర్ణయించారు.
►ఇంకా చదవండి |ఒక్క బిడ్డను కంటే 64 లక్షలిచ్చిన PUBG కంపెనీ ఓనర్ !
దేశ ముడి చమురు సేకరణ ప్రధానంగా వాణిజ్యపరమైన అంశాలు, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అమెరికా ఆంక్షల నిషేధ గడువు ముగిసిన రష్యా నుంచి దేశం చేసే కొనుగోలు కొనుగోలుపై ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు. షిప్పింగ్ మార్గాలను ప్రభావితం చేస్తున్న ప్రపంచ అనిశ్చితులు, ఉద్రిక్తతలు భారతదేశ ఇంధన సరఫరా స్థిరంగా, పటిష్టంగా ఉందని చెప్పారు. ముడి చమురు కొరత లేదు.. తగినన్ని నిల్వలు దేశంలో ఉన్నాయి.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆగవు.. అమెరికా ఆంక్షలు లైట్ తీసుకున్న ఇండియా..!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

