Jr NTR : గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం పై ఏ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ చానెల్స్‌లో కూడా ఈ అంశంపై చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఈ నెల 18 న జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నారని , ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయన కొత్త పార్టీ ని స్థాపించారని, ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు స్పందించారు. ఈ నెల 18 న నిర్వహించబోయే ప్రెస్ మీట్ కి , రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు , దయచేసి ఇష్టమొచ్చిన ప్రచారాలు చేయకండి , వాస్తవాలు తెలుసుకోండి అంటూ ఎన్టీఆర్ అభిమానుల సంఘాలు అధికారికంగా స్పందించాయి.
అయితే జులై 18 న ఎన్టీఆర్ నిర్వహించబోయే ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశ్యం , త్వరలోనే ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఊరువాడ’ అనే కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు 100 కోట్ల రూపాయల విలువ చేసే సేవా కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నారు. తిరుపతి లో ఈ నెల 18 న తాజ్ హోటల్ లో ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ ద్వారా , ‘ఊరువాడ’ గురించిన ప్రణాళికను వివరించనున్నారు. నిజానికి ఈ ప్రోగ్రాం ని ఎప్పుడో మొదలు పెట్టాలని అనుకున్నారట. కానీ పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేయడం కోసం ఇంత సమయం పట్టిందని ఎన్టీఆర్ అభిమాన సంఘాలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి అయితే రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రావడం లేదని చాలా క్లారిటీగా చెప్పారు కానీ , భవిష్యత్తులోకి ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ ఈ శ్రీకారం చుట్టారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
పూర్తిగా ఆయన తమిళనాడు సీఎం విజయ్ మోడల్ ని సూచించారని అంటున్నారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు 2009 సంవత్సరం లోనే తన 84 వేల ఫ్యాన్స్ అసోసియేషన్స్ ని ఒక తాటి పైకి తీసుకొచ్చాడు. వాళ్ళ చేత అప్పటి నుండి ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించారు , ప్రతీ ఇంటికి దగ్గరయ్యే ప్రయత్నం చేసారు విజయ్. సరిగ్గా సమయం చూసి , వాళ్లందరినీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు , సక్సెస్ సాధించి సీఎం అయ్యారు. ఎన్టీఆర్ కూడా అదే స్ట్రాటజీని అనుసరించి 2034 లేదా 2039 కి రాజకీయ అరంగేట్రం చెయ్యాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

