. పవన్ కల్యాణ్‌కు కూనంనేని చురక
. పరిపక్వత లేని వివాదస్పద వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటని నిలదీత
. నేడు బషీర్‌బాగ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం
విశాలాంధ్ర – హైదరాబాద్: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న ప్రజా ద్రోహమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పరిపక్వత లేని వివాదస్పద వ్యాఖ్యలు తెలుగు ప్రజల మధ్య అనవసర ఉద్రిక్తతలు సృష్టించేలా ఉన్నాయని…తెలంగాణ అవతరణ రోజునే వచ్చి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం వెనుక దాగి ఉన్న దినోత్సవం ఏమిటో ప్రజలకు చెప్పాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం భవన్లో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐ.టి.నరసింహతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ-ఆంధ్ర ప్రజలు అన్న దమ్ముల్లా కలిసి ఉండాలని కమ్యూనిస్టులు కోరుకుంటున్నారని కూనంనేని అన్నారు. ఎవరో వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను పెద్దదిగా చేసి… రాష్ట్రాల మధ్య వివాదం మార్చే ప్రయత్నం జరుగుతూనే ఉంది. రాజకీ యాలు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది కానీ ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం సమర్థనీయం కాదన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్న సోదరభావాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
ప్రజా సమస్యలు ఉన్నంత కాలం కమ్యూనిస్టు భావజాలం సజీవమే…
పవన్ కల్యాణ్ కమ్యూనిజం చచ్చిపోయిందంటూ వ్యాఖ్యానించడం వెనుక ఉద్దేశం ఏమిటని కూనంనేని ప్రశ్నించారు. రాజకీయ ప్రవేశం సందర్భంగా పవన్… చేగువేరా ఫొటోతో రావడాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజల సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు భావజాలం సజీవంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల బాధలకు స్పందించి ప్రశ్నించే ప్రతి మనిషిలో కమ్యూనిస్టు ఆలోచన ఉంటుంది… ఎవరూ అంతం చేయలేరని దాని గురించి. గతంలో కమ్యూనిస్టు భావజాలం గురించి మాట్లాడి…ఎర్ర కండువా వేసుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు కమ్యూనిస్టులనే లక్ష్యంగా చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన గుర్తు చేశారు. ప్రజా గాయకుడు గద్దర్‌కు తాము అండగా నిలిచామని చెప్పారు. గద్దర్‌కు తానే కారు ఇచ్చానంటూ పవన్‌కల్యాణ్ ప్రచారం చేయడం సరికాదని… ప్రజల ప్రేమాభిమానాలే గద్దర్‌ను నిలబెట్టాయని స్పష్టం చేశారు. ఒక చేత్తో చేసిన సహాయం మరో చేతికి కూడా తెలియకూడదన్న సంస్కారం ఉండాలని సూచించారు. దివంగత గద్దర్ గారి కుమార్తె వెన్నెల ఈ వైద్యాన్ని ఖండించడం కూడా జరిగింది.
నేడు బషీర్‌బాగ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం
ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ఏపీలో అక్రమ కేసులను నిరసిస్తూ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ అధ్వర్యంలో మేధావులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి కూనంనేని సాంబశివరావు గురువారం మాట్లాడారు. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఈ సమస్య ఉత్పన్నం కాకుండా పూర్తిగా ముగింపు పలకాలనే ఉద్దేశ్యంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా అధిక ధరలను నిరననగా ఈ10న అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు 45 నియోజకవర్గాల్లో భారీ పాదయాత్రలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లో ఎండగట్టారు. సెప్టెంబర్ 28న వేలాది మందితో ఢిల్లీకి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

