రాష్ట్రంలోనే ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణం నేడు శంకుస్థాపన జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయానికి చెందిన ప్రాంతంలో ఈ అకాడమీ నిర్మాణం జరగనుంది. విస్ ఫ్లైట్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఎఫ్‌టీవో ఏర్పాటు.
పురంద్రేశ్వరి చేత ప్రారంభం
ఉదయం 8 గంటలకు ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విమానయాన రంగ నిపుణులు పాల్గొననున్నారు. జార్విస్ ఏవియేషన్ అకాడమీ సుమారు రూ.100 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

