రాజస్థాన్ లో విషాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ పాస్ పనుల్లో ప్రమాదం జరిగింది. అండర్పాస్ పనుల్లో మట్టి కూలి ఇద్దరు రైల్వే ఇంజినీర్లు మృతి చెందిన ఘటన కోట జిల్లాలో జరిగింది. రాజస్థాన్లోని కోటా జిల్లా దారాఘాటి హైవేపై నిర్మాణంలో ఉన్న అండర్పాస్ వద్ద ఈ మట్టి కూలిపోయింది.
మృతుల్లో ఇంజినీర్లు…
మృతుల్లో జూనియర్ ఇంజినీర్ ప్రభాత్సింగ్, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సంజయ్ జాలు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీశాయి. ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

