TDP Women Reservation: తెలుగుదేశం పార్టీ మహానాడు కొనసాగుతోంది. పూర్తి హైబ్రిడ్ విధానం ఏర్పాటు చేసిన మహానాడు తొలిరోజు సక్సెస్ అయ్యింది. రెండో రోజు కూడా కొనసాగుతోంది. గత మహానాడులకు భిన్నంగా ఈసారి జరుగుతుండడం విశేషం. పూర్తి డిజిటల్ విధానంలో దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది టీడీపీ శ్రేణులు ఈ మహానాడులో భాగస్వామ్యం కావడం ఈసారి ప్రత్యేకత. తొలిరోజు భారీ సంచలనం నమోదైంది. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం టికెట్లు కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటన చేశారు. పార్లమెంట్లో ప్రవేశ పెట్టే బిల్లుతో సంబంధం లేకుండానే ఏపీలో అమలు చేసి తీరుతామని ప్రకటన చేశారు లోకేష్. ఇది మహిళలో ఎంతగానో ఆకట్టుకుంటుంది. టిడిపి నుంచి వచ్చిన ఈ ప్రకటనతో మిగిలిన రాజకీయ పక్షాలు బెంబేలెత్తిపోతున్నాయి. పూర్తిగా ఆత్మరక్షణలో పడింది.
* మహిళకు రాజ్యసభ పదవి
అయితే వచ్చే ఎన్నికల వరకు కాదు. రాజ్యసభ కూడా ఈ మహిళలకు తాజా రిజర్వేషన్ అమలు చేయడానికి చంద్రబాబు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి బిజెపికి ఛాన్స్ లేదు.. మూడు పదవులను టిడిపి తీసుకుని.. ఒక పదవి జనసేనకు కేటాయించిన వార్తలు వచ్చాయి. కానీ పెద్ద బిజెపిలు అడిగితే కచ్చితంగా చంద్రబాబు మెత్తబడతారు. మరోవైపు టిడిపి సభ్యుడిగా ఉన్న సానా సతీష్ మరోసారి ప్రమోట్ కావడం ఖాయం. అదే జరిగితే మిగిలేది ఒకే ఒక రాజ్యసభ టిడిపికి. ఆ పదవి సైతం మహిళలకు కేటాయించి మంచి సంకేతాలు అందించారు చంద్రబాబు.
* మహిళల్లో ఆసక్తి..
అయితే ఈసారి మహానాడు చాలా భిన్నంగా ఉంది. పూర్తిగా మహిళా ధీమ్ తో కొనసాగుతున్న ఈ మహానాడులో మహిళా నేతలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈసారి మహిళలకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయని భావించి.. సీనియర్లు సైతం తమ వారసులను ప్రోత్సహించారు. అయితే మహిళలకు 33 శాతం టికెట్ల కేటాయింపు ప్రకటనపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిని కొనసాగింపు చెయ్యాలని కోరుకుంటున్నారు చంద్రబాబు మహిళలకు రాజ్యసభ ఎంపిక ఒక నిర్ణయానికి వచ్చినట్లు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

