- అయోధ్య రామమందిరంపై అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..
- భక్తులు ఇచ్చిన కానుకలు మాయమైనట్లు ఆరోపణలు..
అఖిలేష్ యాదవ్: ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల కానులకు అదృశ్యమయ్యాయని. ఎక్స్ పోస్టులో ఆయన ఈ సంచలన ఆరోపణలు చేశారు.
”రామ మందిరానికి సమర్పించిన కోట్ల రూపాయల కానుకలు గల్లంతవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులకు అత్యంత సున్నితమైన వార్త. ఇది ఆలయ ట్రస్టుకు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి. వివరణ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావత్ సనాతన సమాజానికి శ్రీరామునిపై ఉన్న ప్రగాఢ విశ్వాసానికి ఇది నేరుగా సంబంధించిన విషయం కాబట్టి, కోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించాలని అభ్యర్థిస్తున్నాము. ప్రభుత్వ మౌనం అనుమానాస్పదంగా ఉంది.” అని ట్వీట్ చేశారు.
ఎస్పీ అధినేత చేసిన ఆరోపణలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పందించలేదు. ఈ వార్త వైరల్ అయిన తర్వాత ట్రస్ట్ నుంచి ఎలాంటి వివరణ, ఖండన రాలేదు. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నెలల్లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లు రాబోతున్న నేపథ్యంలో అఖిలేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సమస్త విశ్వ మే భగవాన్ రాముని ఉపాసన కొరకు ఏ ఒక్క గొప్ప పరిశోధనా సమాచారము’ కె చఢావే కి కరోడొం కి రకం గాయబ్ పాయి గై.
యే మందిర్ ట్రస్ట్ అత్యంత శర్మనాక స్థితిని కలిగి ఉంది. కోయి భీ సఫై దేనే కోసం సమానం లేదు ఆనా చాహతా హే.
న్యాయలయ సే స్వతః సంజ్ఞానం లేనిది నాకు చాలా ఉంది…
– అఖిలేష్ యాదవ్ (@yadavakhilesh) జూన్ 7, 2026

