సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పుపల్లి పంచాయతీ పరిధిలోని రామోజీపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు బాలురు మరణించారు.
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పుపల్లి పంచాయతీ పరిధిలోని రామోజీపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవులు కావడంతో సరదాగా చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు బాలురు నీట మునిగి మరణించారు. వేసవి సెలవులు కావడంతో ఈతకు వెళ్లిన నిరంజన్(13) బసవరాజు(10) మణి(12) అనుకోకుండా నీళ్లలో మునిగిపోయారు.
గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు జరుగుతోంది. మొదట నిరంజన్, బసవరాజు మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన మణి కోసం గాలించి.. కాసేపటికి అతడి మృతదేహాన్ని కూడా బయటకు తీసుకొచ్చారు. ఈతకు వెళ్లిన బిడ్డలు మృతి చెందడంతో అయ్యో దేవుడా..ఎంత ఘోరం జరిగింది అని వారి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు.

