తన సినిమాల్లో పాత్రల కోసం శారీరకంగా ఎంత కష్టానికైనా వెనుకాడని కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ధృవ, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల కోసం అతనెంత శ్రమించాడో, ఎంత అద్భుతంగా లుక్‌ను మార్చుకున్నాడో తెలుసా. ఇప్పుడు తన నుంచి రాబోయే ‘పెద్ది’ కోసం కూడా ఎంత కష్టపడ్డాడో ప్రోమోల్లో.
ముఖ్యంగా ఇందులో కుస్తీ యోధుడి పాత్ర కోసం చరణ్ ఒళ్లు హూనం చేసుకునేలా కష్టపడ్డాడని, గాయాల పాలు కూడా అయ్యాడని టీం అంతా చెబుతోంది. కుస్తీ పోటీల సన్నివేశాల్లో భాగంగానే చేతిని దెబ్బ తీసి రిస్ట్ బేస్‌తో కనిపిస్తున్నాడు. దాంతోనే ప్రమోషన్లలో కనిపిస్తున్నాడు.
‘పెద్ది’ షూటింగ్లో భాగంగా బాగా దెబ్బ తగిలిందని, దానికి సర్జరీ కూడా అవసరమని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు చరణ్.
‘పెద్ది’లో కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాలను 30 రోజుల పాటు చిత్రీకరించామని, ఆ సమయంలో మొదట్లోనే కొంచెం నొప్పి అనిపించిందని.. కానీ చేతికి ఏమైందో తెలుసుకోవడం కోసం ఎంఆర్ఐ స్కాన్ తీసి చూసేందుకు తనకు భయం వేసిందని.. ఒక వేళ చీలిక (టియర్) ఉంటే షూట్ చేయడమే కదా అనిపించిందని చరణ్ చెప్పాడు.
ఐతే మొదట్లో ఒక చిన్న చీలిక వచ్చి ఉంటుందని అనుకుంటే.. షూటింగ్ అంతా అయ్యాక స్కాన్ చూస్తే ఏకంగా 7 చోట్ల చీలికలు వచ్చిందని చరణ్ తెలిపాడు. చేతికి సర్జరీ అవసరం అయిందని, కానీ ఇప్పుడు శస్త్రచికిత్స చేసుకుంటే ప్రమోషన్లకు దూరం కావాల్సి ఉందని, అందుకే బ్రేస్ వేసుకుని మేనేజ్ చేస్తున్నానని.. సినిమా విడుదల తర్వాత సర్జరీ చేయించుకుంటానని తెలిపాడు. కుస్తీ పోటీల్లో రెజ్లర్లు చేతులు పట్టుకునే ఒకరినొకరు నెట్టుకుంటారనే సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్ రెజ్లర్లతో కలిసి సాధన చేయడం, చిత్రీకరణలో పాల్గొనడంతో చరణ్ చేతికి బాగానే గాయాలైనట్లు కనిపించాయి.

