రామ్ చరణ్ పై బుచ్చి బాబు విరుచుకుపడ్డాడు: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ వచ్చే నెల 4న విడుదల అవ్వబోతున్న సందర్భంగా , మేకర్స్ ప్రొమోషన్స్ తో దుమ్ము లేపుతున్నారు. నేడు ఈ చిత్రం అంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు, ఈరోజు విడుదల చేయబోయే థియేట్రికల్ ట్రైలర్ మీదనే బుకింగ్స్ ఆధారపడి ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే బుచ్చి బాబు ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో , పెద్ది షూటింగ్ సమయంలో తన అనుభవాలను ఒక్కొక్కటిగా పంచుకున్నాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘పెద్ది షూటింగ్ సమయం లో నేను రామ్ చరణ్ గారి మీది ఒక సందర్భం లో అలిగాను , అది నేను ఇప్పటి వరకు చరణ్ గారికి కూడా చెప్పలేదు. చికిరి చికిరి పాట షూటింగ్ సమయంలో ఒక షాట్ లో కాస్ట్యూమ్ సరిగా వర్కౌట్ అవ్వలేదు. అది మానిటర్ లో చూసిన చరణ్ గారు , ఏంటి బుచ్చిలోకి మీరు చూసుకోవాలి కదా అని సీరియస్ గా అన్నాడు, నాతో చరణ్ గారితో పరిచయమైనప్పటి నుండి అంత సీరియస్ గా ఎప్పుడూ మాట్లాడలేదు , ఒక్కసారిగా అలా మాట్లాడేసరికి తీసుకోవడం కాస్త కష్టమైంది , క్యారవాన్ లోకి వెళ్ళిపోయి ఒక 5 నిమిషాలు రామ్ చరణ్ గారి మీద అలిగి బాధపడ్డాను , ఏంటి ఈయన సీరియస్ గా చెప్పాను అని అనుకున్నాను . బుచ్చి బాబు.
అదే విధంగా తన వల్ల మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఎలా ఇబ్బంది పడ్డాడో కూడా చెప్పుకొచ్చాడు బుచ్చి బాబు. ఆయన మాట్లాడుతూ ‘ముందుగా రెహమాన్ గారు రెండు మ్యూజిక్ బిట్స్ ఇచ్చాడు , అందులో ‘మస్సా మస్సా’ బిట్ కూడా ఉంది. ఇది మొదట్లో నేను విన్నప్పుడు సార్ ఇది పెద్దగా బాగోలేదు , ఇంకా బెటర్ వెర్షన్ కావాలి అని అడిగాను , ఓకే చేద్దాం అని రెహమాన్ గారు అన్నారు, కానీ ఆయన తన అసిస్టెంట్స్ తో బాగానే ఉంది కదా మ్యూజిక్ , ఎందుకు డైరెక్టర్ వద్దు అంటున్నాడు? అని అంటూ ఉండేవాడట. తనకు ఇబ్బందిగా అనిపించేలా నాకు చెప్పకుండా, నేను పూర్తిగా సంతృప్తి పడేంత వరకు అందించాడు’ అంటూ బుచ్చి రెహమాన్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు.

