రామ్ చరణ్ ‘పెద్ది’ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ ప్రివ్యూ గురించి అందుతున్న సమాచారం మేరకు ఇది ప్యూర్ స్టోరీ బేస్డ్ సినిమా. 3 గంటల 2 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ నుంచి వచ్చిన టాక్ చూస్తుంటే మాత్రం ‘పెద్ది’ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గూస్ బంప్స్ ఇచ్చే ఒక ఎమోషనల్ హిట్ కింద నిలుస్తుందని అంటున్నారు. క్రాస్ ఓవర్ అథ్లీట్ కాన్సెప్ట్ ని ప్రత్యేకంగా అభినందించారని, ఇందులో తీసుకున్న కాజ్ కూడా చాలా బాగుందట. వీటన్నిటికీ మించి ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా సాగుతుందట.
బేసిక్ గా ఒక సినిమాలో లాస్ట్ 10 లేదా 20 నిమిషాలు ఎమోషన్స్ ఉంటేనే ఎంజాయ్ చేయడం చూశాను. బట్ ఇంత సినిమాలో రామ్ చరణ్ లాంటి స్టార్ ని పెట్టుకొని సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ మీద నడపడం కత్తి మీద సాము లాంటిది. దాదాపు చివరి 50 నిముషాలు అలానే ఉన్నట్లు చెబుతున్నారు. యాక్షన్, కామెడీ, కమర్షియాలిటీ అన్నీ లాక్ ఆఫ్ ఎమోషన్ వల్ల ఫెయిల్ అయిన సినిమాలు మనం చూసాం. కానీ, ఎమోషన్ ఉండి ఫెయిల్ అయిన సినిమా మాత్రం ఇప్పటి వరకు చూడలేదు.
ఆ రకంగా చూసుకుంటే సెకండ్ హాఫ్ అంతా కూడా ‘పెద్ది’ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ తో ఉంటుందని అంటున్నారు. రామ్ చరణ్ ఎమోషన్ ఎంతలా పండిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘రంగస్థలం’ను మించిన పర్ఫార్మెన్స్ అని స్వయంగా సుకుమార్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత.. చరణ్ ఎలాంటి యాక్టింగ్ చేసి ఉంటాడనే అనుమానాలు అక్కర్లేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ‘పెద్ది’ వరల్డ్ ని ఎలివేట్ చేయడానికే సరిపోతుందట. ఇక సెకండాఫ్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉండబోతోంది. ఈ టాక్ గనుక నిజమైతే.. థియేటర్ల వాళ్ళు, చరణ్ ఫ్యాన్స్, అలాగే ఒక సినీ ప్రాపర్ స్టార్ సినిమా చూసి చాలా కాలమైందని ఫీల్ అవుతున్న సగటు అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ‘పెద్ది’ కచ్చితంగా నిలబెడుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి.

