రావు బహదూర్ బాక్స్ ఆఫీస్ : విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించిన ‘రావు బహదూర్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది , మొదటి ఆట నుండి పర్వాలేదు, బాగుంది అనే టాక్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా లో ఫస్ట్ హాఫ్ పై అనేక కంప్లయింట్స్ వచ్చాయి కానీ , మ్యాట్నీ షోస్ కి టాక్ సెటిల్ అయ్యింది. ఈ జానర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ ని ఈ చిత్రం సంతృప్తిపరిచిందని ఓపెనింగ్స్ ని చూస్తుంటే అర్థం అవుతోంది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రం గంటకు 3 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. సత్యదేవ్ రేంజ్ కి ఇది చాలా మంచి ట్రెండ్ అంటే చెప్పాలి . గతం లో ఆయన చేసిన సినిమాల్లో దేనికి కూడా ఇంత ట్రెండ్ కనపడలేదు.
మరోపక్క నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రం 1 లక్ష 20 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా ఓవర్సీస్ నుండే ఈ చిత్రం మొదటి రోజు + ప్రీమియర్స్ కి కలిపి 3 లక్షల డాలర్లు వచ్చేలా అనిపిస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు అన్నమాట. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా డీసెంట్ స్థాయిలో టికెట్లు అమ్ముడుపోతున్నాయి కాబట్టి , 4 నుంచి 5 కోట్ల మధ్యలో గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 7 నుండి 8 కోట్ల రూపాయిల మధ్యలో గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వబోతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అదే కనుక జరిగితే ఈ చిత్రం మొదటి రోజే 50 శాతం బ్రేక్ ఈవెన్ జరిగినట్టు అనుకోవచ్చు.
ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయలకు జరిగింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రం మొదటి రోజున 4 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే ట్రెండ్ రేపు , ఎల్లుండి కూడా కొనసాగితే , ఈ చిత్రం అవలీలగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెడుతుంది. మరి ఈ వీకెండ్ ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. ఒకవేళ హోల్డ్ చేస్తే మాత్రం మన టాలీవుడ్ కి ఈ ఏడాది మరో క్లీన్ హిట్ సినిమా వచ్చినట్టే. టాక్ కూడా పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది కాబట్టి , కచ్చితంగా ఈ చిత్రం మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అవ్వబోతుందని అంటున్నారు ట్రేడ్ పబ్లిక్ విశ్లేషకులు.

