మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత బంగారు కుటుంబంగా మార్చుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో తెలంగాణలో ఎలాంటి మార్పు లేదని, అవినీతి, అక్రమాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్‌కు అడ్డాగా మార్చారని కేంద్ర బొగ్గు గను ల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి వందల కోట్ల ను రేవంత్ రెడ్డి తీసుకెళ్లి, కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగిస్తున్నారని. రేవంత్ రెడ్డి అందుకే తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారా? ఆరు గ్యారంటీలు అమలు చేయకుం డా రాహుల్ గాంధీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను టీ చేస్తున్నదని ఆ యనలూ ఉన్నాయి. ఒకప్పుడు మిగులు రా ష్ట్రంగా ఉన్న తెలంగాణను బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత దివాళా దిశగా తీసుకెళ్ళాయని గుర్తు చేశారు.
పదవీ విరమణ చేసిన బెయినెఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బిజెపి ప్రభుత్వంలోకి వస్తే సాధ్యమవుతుంది.తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు అనేక రకాల ఉద్యమాలు చేశారు, వీధుల్లో తెలంగాణ నినాదాలు చేస్తున్న హైస్కూల్ పిల్లలను ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారిని తుపాకులతో కాల్చి చంపించిందని ఆయన చెప్పారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ అధికారంలో ఉన్నారని, దాదాపు 320 మంది ప్రాణ త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం మలి దశ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానం చేశారని, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత మంది ఆత్మ బలిదానం చేసుకున్న ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది.
హింస లేకుండా తెలంగాణ పోరాటంలో 4 కోట్ల మంది ముందుకొచ్చి కొట్లాడారని, మలి దశ ఉద్యమం సమయంలో ఢిల్లీలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమాన్ని నిర్ధాక్షిణ్యంగా అణిచివేశారని ఆయన దుయ్యబట్టారు. ఢిల్లీలో యాది రెడ్డి అనే తెలంగాణ విద్యార్థి పార్లమెంటు దగ్గర బలిదానం చేసుకున్నారని ఈ ఉద్యమం దేశంలో మార్మోగిందని ఆయన చెప్పారు. తన చావుకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కారణమని లేఖ రాసి ఆత్మ బలిదానం చేసుకున్నారని ఆయన చెప్పారు. బిజెపిని బిజెపి ఎంపీలంతా తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీని నిలదీసి తెలంగాణకు మద్దతు పలికారని, సుష్మా స్వరాజ్ దేశంలోని గ్రామాల నుండి పట్టణాల వరకు బిజెపి పోరాడుతుందని, ఢిల్లీలో కూడా భారీ ఉద్యమం చేస్తే అప్పటి కాంగ్రెస్ పార్టీ టియర్ గ్యాస్, లాఠీచార్జ్ చేయించారని ఆయన గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాలు వస్తే అభివృద్ధి జరుగుతుందని నమ్మిన పార్టీ అని, అందుకే తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
పరస్పర సహకారంతో ‘వికసిత్ భారత్’
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న సోదరభావాన్ని, బంధాన్ని ప్రస్తావిస్తూ.. రెండు రాష్ట్రాలు పరస్పర స్నేహంతో, ఆరోగ్యకరమైన అభివృద్ధి పోటీతో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. ‘తెలుగు ప్రజలమైన మనకు రెండు రాష్ట్రాలు ఉన్నాయి. మన మధ్య ఎటువంటి ద్వేషాలు, విభేదాలు ఉండకూడదు.. కేవలం అభివృద్ధిలో మాత్రమే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు.’వికసిత్ తెలంగాణ’ ఇంకా ‘వికసిత్ ఆంధ్రప్రదేశ్’ లు కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే ‘వికసిత్ భారత్’ స్వప్నం సాకారమవుతుందని ఆయన చెప్పారు. యువకులు, విద్యార్థులు, మరియు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు చేసిన అపారమైన త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ ఆకాంక్ష కోసం 1,200 మందికి పైగా యువకులు తమ ప్రాణాలను త్యాగం చేసారు, వారి సుదీర్ఘ పోరాటం మరియు బలిదానాల వల్ల దశాబ్దాల కల సాకారమైందని భావోద్వేగంగా పేర్కొన్నారు. ‘తెలంగాణ అనేది కేవలం ఒక సాధారణ రాష్ట్రం కాదని, ఏర్పాటు వెనుక తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మగౌరవం, అసంఖ్యాక త్యాగాలతో కూడిన సుదీర్ఘ ఉద్యమం. తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య, పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే ఏర్పాటైనది. ఈ ప్రక్రియలో తమ పార్టీ పోషించిన కీలక పాత్రను గుర్తుచేస్తూ పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు బేషరతుగా, అచంచలంగా మద్దతు పలికిన అప్పటి లోక్‌సభ ప్రతిపక్ష నేత, దివంగత సుష్మా స్వరాజ్‌ను గుర్తుంచుకుంటారు’ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన నేపథ్యంలో, ఇప్పుడు మన ప్రయాణం మరింత అభివృద్ధి ప్రగతి వైపు సాగాలని ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. ‘వికసిత్ భారత్’ అనే బృహత్ సంకల్పంలో భాగంగా మనమంతా కలిసికట్టుగా ‘వికసిత్ తెలంగాణ’ లక్ష్యం కోసం కృషి చేసింది రాంచందర్ రావు.

