- ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ
- డ్రైవర్లతో కలిసి భోజనం చేసిన ప్రతిపక్ష నేత
- సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆటో అవతారమెత్తారు. శుక్రవారం ఢిల్లీలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ ప్రాంతంలోని తోడర్మల్ పార్క్‌లో ఆటో డ్రైవర్లతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్ యూనిఫామ్ ధరించి కనిపించారు. చిన్నారులతో సెల్ఫీలు దిగుతూ అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్లతో కలిసి భోజనం చేశారు.
ఆటో డ్రైవర్ రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. తమ వ్యాపారం మందగించిందని.. పెరుగుతున్న ఖర్చులతో జీవితం కష్టంగా మారిందని రాహుల్ గాంధీకి వివరించామని చెప్పారు. తమ పిల్లల చదువు, రోజువారీ ఆదాయం, కుటుంబ పోషణ గురించి కూడా రాహుల్ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. “మేమంతా కలిసి దాల్, రోటీ, కూరతో సాధారణ భోజనం చేశాం” అని రమేష్ ప్రసాద్ చెప్పారు. మరో ఆటో డ్రైవర్ అరిందర్ కుమార్ షా మాట్లాడుతూ.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముఖ్యంగా గ్యాస్ ధరల పెరుగుదల వల్ల జీవితం చాలా కష్టమైందని రాహుల్ గాంధీకి వివరించామని చెప్పారు.
“ఆటో డ్రైవర్ల సమస్యలకు మద్దతుగా నిలుస్తున్నానని, మా సమస్యలను నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ ముందు పార్లమెంట్లో ప్రస్తావిస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
#చూడండి | ఢిల్లీ: కాంగ్రెస్ నేత, లోక్‌సభ లోక్‌సభ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ తన నివాసం వెలుపల ఆటో రిక్షా డ్రైవర్ యూనిఫారం ధరించి కనిపించారు. అతను ఆటో-రిక్షా డ్రైవర్లతో ఇంటరాక్ట్ అయ్యాడు మరియు సంభాషణ సమయంలో వారితో భోజనం కూడా చేసాడు. pic.twitter.com/QsHLOJzyjN
– ANI (@ANI) మే 29, 2026
వీడియో | ఢిల్లీ: లోక్‌సభ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ (@రాహుల్ గాంధీ) తోడార్మల్ పార్క్, బెంగాలీ మార్కెట్లో ఆటో డ్రైవర్లతో సంభాషిస్తుంది.
(పూర్తి వీడియో PTI వీడియోలలో అందుబాటులో ఉంది – https://t.co/n147TvrpG7) pic.twitter.com/ibe97tCYTQ
— ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (@PTI_News) మే 29, 2026

