ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు షర్మిల దంపతులు ఢిల్లీకి చేరుకున్నారు. రాహుల్‌తో ఏపీ పీసీ చీఫ్ షర్మిల దంపతులు భేటీలో ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతున్నట్లు తెలిసింది.
రాజ్యసభ పదవిపైనా…
మరొకవైపు కర్ణాటక నుంచి వైఎస్ షర్మిలకు రాజ్యసభ పదవి ఇస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుత జూన్ నెలలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతుంటాయి. వైఎస్ షర్మిలతో రాహుల్ ఈ విషయంపై కూడా మాట్లాడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

