అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన జలమండలి జీఎం కుమార్కు 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. దీంతో అనంత లక్ష్మీకుమార్కు 14 రోజుల రిమాండ్ ఏసీబీ కోర్గు విధించింది.
చంచలగూడ జైలుకు…
దీంతో పోలీసులు కుమార్ను చంచల్గూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ దాడుల్లో వందల కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కుమార్ ను కస్టడీలోకి తీసుకుని బ్యాంక్ లాకర్లను తెరిచే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.

