- విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త
- పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం ప్రవహించే ఛాన్స్
దేశీయ మార్కెట్లలో విదేశీ ప్రవాహాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. కొన్ని సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు పన్ను నిబంధనలను సడలించడానికి కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ రకాల ఆమోదం తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను కేబినెట్ ముందుకు తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే ఈ సడలింపుల పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ఇటీవల రూపాయి విలువ అమెరికా డాలర్‌తో దాదాపు 6 శాతం బలహీనపడటం.. జనవరి నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకోవడం ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
విదేశీ పెట్టుబడుల ఉపసంహరణపై ఆందోళన
ఈ ఏడాది ప్రారంభం నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి రికార్డు స్థాయిలో రూ.2.25 లక్షల కోట్లకు పైగా నిధులు వెనక్కి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల రూపాయి విలువపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తోంది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం అనంతరం ఆర్బీఐ కూడా కొన్ని కీలక చర్యలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ప్రభుత్వ బాండ్లపై పన్ను మినహాయింపు?
ఇదిలా ఉండగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత ప్రభుత్వ సెక్యూరిటీల్లో (G-Secs) పెట్టే పెట్టుబడులపై ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నులను పూర్తిగా మినహాయించే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ బాండ్ల ద్వారా పొందే వడ్డీపై 20 శాతం విత్‌హోల్డింగ్ ట్యాక్స్ (TDS), అలాగే 12.5 శాతం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అమల్లో ఉన్నాయి. 2023 జూలై 1 వరకు ఈ విత్‌హోల్డింగ్ ట్యాక్స్ రేటు కేవలం 5 శాతంగా ఉండేది.
విదేశీ పెట్టుబడిదారుల డిమాండ్లు
కేంద్ర బడ్జెట్‌కు ముందు విదేశీ పెట్టుబడిదారుల ప్రతినిధులు భారత మార్కెట్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని సూచిస్తారు. ముఖ్యంగా లిస్టెడ్ సెక్యూరిటీలపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పునఃసమీక్షించాలని.. ఒకేసారి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌తో పాటు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) విధించడం పెట్టుబడిదారులకు భారంగా మారిందని అభిప్రాయపడ్డారు.
యుద్ధ ప్రభావం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, రూపాయి బలహీనత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాల మధ్య విదేశీ పెట్టుబడిదారులకు పన్ను రాయితీలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారింది. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు.

