లక్నో: మద్యానికి బానిస కావడంతో పాటు ఆస్తి వివాదం కన్నతండ్రిని తుపాకీతో కుమారుడు కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గాజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మోదీనగర్‌లో హరీ ఓం చౌదరీ, అనిత అనే దంపతులు రూపొందించారు. ఈ దంపతులకు 47 ఎకరాల పొలం, ఢిల్లీలో 150 కోట్ల విలువ చేసే కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ఈ దంపతులకు నిఖిల్, నీషు అనే కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు నిఖిల్ మద్యానికి బానిసగా మారి ఆస్తులు రాసి పలుమార్లు తండ్రితో గొడవకు దిగాడు. షాపింగ్ కాంప్లెక్స్‌లోని కొని దుకాణాలు, 15 ఎకరాల భూమిని రాసిచ్చారు. మిగిలిన ఆస్తిని కూడా తన పేరుపై రాయాలని పలుమార్లు నిఖిల్ డిమాండ్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి నిఖిల్ ఫుల్‌గా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఇంటికి రావడంతో కుమారుడిని తండ్రి మందలించడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. తన ఆస్తి తనకు రాసి తండ్రితో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో తండ్రిపై తుపాకీతో కుమారుడు కాల్పులు జరిపాడు. దీంతో తండ్రి ఘటన స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

