రెడ్మీ టర్బో 5 కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల: మిడిల్ క్లాస్ పీపుల్స్ మొబైల్ కొనాలని అనుకుంటే రెడ్మి కంపెనీ వైపు ఎక్కువగా చూస్తారు. కస్టమర్స్ కు అనుగుణంగా ఈ కంపెనీ లేటెస్ట్ గా Turbo 5 అనే మొబైల్ ను తీసుకురాబోతుంది. ఈ ఫోన్ గురించి ఇప్పటివరకు కొన్ని లీకులు బయటకు వచ్చాయి. ఇది జూన్ 2026 తొలి వారంలో లేదా జూన్ 10, 2026 నాటికి భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందంటే?
రెడ్ మీ టర్బో 5లో 6.59 1.5K AMOLED డిస్ ప్లే ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్ ఉండవచ్చని అంచనా. అలాగే ఈ మొబైల్ కు 12 జీబీ నుంచి 16 జీబీ వరకు ర్యామ్ ఉండే అవకాశం ఉంది. అలాగే 256GB లేదా 512GB స్టోరేజ్ ఉండనుంది. ఇందులో HyperOS 3 ఆధారిత Android 16 మీద పనిచేయొచ్చని సూచిస్తుంది.
ఈ ఫోన్లో 7,560mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. రెడ్ మీ సెగ్మెంట్లో ఇది చాలా పెద్దది. ఈ బ్యాటరీకి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్ లెస్ ఛార్జింగ్ పోర్ట్ కూడా రావచ్చని లీక్‌లు చెబుతున్నాయి. ఈ కొత్త మొబైల్లో కెమెరా సెటప్‌లో భాగంగా 50MP Sony IMX 882 ప్రైమరీ సెన్సార్ కెమెరా ఉండనుంది. 20MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని రిపోర్టులు ఉన్నాయి. చైనా వెర్షన్లో 50MP + 8MP రియర్ కెమెరా సెటప్ చూపిస్తుంది. డిజైన్ పరంగా ఫ్లాట్ బ్యాక్, ప్రత్యేక డ్యూయల్ కెమెరా రింగ్‌లు, మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్, మరియు రెడ్మి బ్రాండింగ్ ఉండే అవకాశం ఉంది.లీక్‌ల ప్రకారం.. 12GB + 256GB వేరియంట్ ధర సుమారు రూ.27,999, 16GB + 512GB వేరియంట్ ధర సుమారు రూ . 36,999గా ఉండొచ్చు.
బడ్జెట్ లో మొబైల్ కొనాలని అనుకునేవారికి ఈ ఫోన్ బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంది. రోజూ వారీ వినియోగదారులు ఇప్పుడు ఈ రేంజ్ ఫోన్ కోసం ఉన్నారు. దీంతో రెడ్ మీ తీసుకొచ్చిన ఈ మొబైల్ ఎలాంటి అంచనాలు అందుకుంటుందో చూడాలి.

