తుర్కియోలో కాల్పుల ఘటన కలకలం రేపింది. రెస్టారెంట్ లో తుపాకితో యువకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. ఎనిమిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. దక్షిణ తుర్కియేలోని మెర్సిన్ సిటీలో ఈ దారుణం జరిగింది. కాల్పులు జరిపిన యువకుడి వయసు 17 ఏళ్లు అని చెబుతున్నారు. టార్సస్ లోని ఒక రెస్టారెంట్ లోకి ప్రవేశించిన ఈ యువకుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు.
కాల్పులు జరిపిన అనంతరం ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ కాల్పుల ఘటనలో రెస్టారెంట్ యజమానితో పాటు సిబ్బంది, మరో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులు జరిపిన యువకుడి కోసం గాలిస్తున్నారు.

