IND vs AFG టెస్ట్: గల్లీల ముచ్చట్లు, సోషల్ మీడియా రచ్చ పక్కన పెడితే.. అత్యుత్తమ ప్లేయర్స్ ఆఫ్ఘనిస్తాన్‌తో ఢీ అంటే ఢీ అనడానికి సిద్ధమైపోయిండ్రు. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో రేపు (2026, జూన్ 6) బుధవారం (2026, జూన్ 10) వరకు ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
మ్యాచ్ కి ముందే నెట్టింట హడావుడి:
మ్యాచ్ స్టార్ట్ కాకముందే సోషల్ మీడియాలో ఒక్కటే హడావుడి నడుస్తోంది. స్టేడియంలో పిచ్ మొత్తం కప్పేసి, కుండపోత వాన పడుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అరేయ్.. ఒక్కటే టెస్ట్ మ్యాచ్ రా భాయ్, ఇది కూడా వాన పడి ఆగిపోతే ఎట్లా? అని క్రికెట్ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. కానీ, అసలు ముచ్చట వేరే ఉంది. ముల్లాన్‌పూర్ వెదర్ రిపోర్ట్ చూస్తే ఫ్యాన్స్ షాక్ అవుతారు.
వానొచ్చే ఛాన్స్ లేదు:
రాబోయే ఐదు రోజులు (జూన్ 6 నుంచి 10 దాకా) ఎండలు దంచికొట్టబోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 37°C నుంచి 41°C వరకు రికార్డు అయ్యే ఛాన్స్ ఉంది. రాత్రి పూట కూడా 27°C నుంచి 29°C వరకు వేడిగానే ఉంటుందని వాతావరణ శాఖ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో చూపిస్తున్న వీడియోలు పాతవి.. ఎందుకంటే ఈ ఐదు రోజులు వాన పడే ఛాన్సెస్ అస్సలు లేవని తేల్చేసింది. మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత 40 డిగ్రీ పైనే ఉంటుంది కాబట్టి, గ్రౌండ్లో ప్లేయర్లకు, గ్యాలరీలో ఉన్న ఫ్యాన్స్ చుక్కలు చూడటం పక్కా.
ముల్లన్పూర్ క్రికెట్ స్టేడియంలో భారీ వర్షం. రెండు రోజుల్లో భారత్ ఇక్కడ ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్టు మ్యాచ్ ఆడనుంది.⛈️ pic.twitter.com/iH0b4ttuTe
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) జూన్ 4, 2026

