విశాలాంధ్ర ధర్మవరం;; రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మంచి సేద్యం అవుతుందని ఏడిఏ లక్ష్మానాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ గారు క్లాస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి గారు , సీడ్ డైరెక్టర్ కాటమయ్య గారు మరియు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరైన మండల స్థాయి మరియు డివిజన్ స్థాయి అధికారులు ప్రకృతి వ్యవసాయం , వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పీఎండీఎస్లో భాగంగా విత్తనాలకు పెల్లటైజేషన్ చేయడం జరిగింది. రైతులను ఉద్దేశించి లక్ష్మనాయక్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని రైతులందరూ ఆచరించవలసి ఉంది. మధ్యాహ్నం గొట్లూరు గ్రామంలో రైతు పోతులయ్య పొలంలో ఆముదము ,అలసందలు, సద్దలు ,మొక్కజొన్నలను పిఎండిఎస్ లో పిలేటి శేనన్ చేసి విత్తడం జరిగింది. ఇందులో భాగంగా విత్తనాలను ఘనజీవామృతంతో శుద్ధిచేసి బంకమన్ను , ఘనజీవామృతం లతో నాలుగు లేదా ఐదు పొరలుగా తయారు చేయడం జరుగుతుంది. చివరిగా బూడిదతో కోటింగ్ చేసి ఆరబెట్టడం జరిగింది అని, ఆరబెట్టిన విత్తనాలను పొలంలో చల్లడం జరిగింది. దీనివల్ల విత్తనం వర్షాలు పడిన వెంటనే నీటిని పీల్చుకొని మనకెత్తుతుంది. దీనివల్ల భూమి వాతావరణంలో పచ్చదనము పెంచడం జరుగుతుంది. నేల కొతకు గురి కాకుండా కాపాడడం జరుగుతుంది. వర్షం నీళ్లు పడిన చోటనే భూమి లోనికి ఇంకుతాయి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముస్తఫా ఏఈఓ అశ్విని విహెచ్ఎ ఆశాజ్యోతి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆదినారాయణ ఉగ్ర నరసింహ పకీరప్ప ఆదినారాయణ బి టి యం ప్రతిభ రైతులు ఉన్నారు.

