హైదరాబాద్: విద్యుత్ శాఖ అనేది సర్వీస్ డిపార్ట్ మెంట్..అందులో వివిధ కేటగిరీలు ఉండవచ్చని, ఆర్థిక వ్యవస్థను నడిపించే అత్యంత కీలకమైన విద్యుత్ రంగం అని బిఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతాంగ శ్రేయస్సుకు సంబంధించిన ప్రధాన అంశమిది అని ప్రభుత్వ దరఖాస్తును తిరస్కరించాలని కోరుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదరబాదరాగా 2వ తేదీ నుంచి అమలు చేయడం ఎలా సమంజసం అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర విచారణ చేసి వివరణ తీసుకుంటే మంచిది అని సూచించారు. మిగిలిన రంగాలకు చోదక శక్తిగా ఉపయోగపడుతున్న విద్యుత్ రంగం గ్రామీణ ప్రాంతంలో, ప్రజల రైతుల సంక్షేమ పరిగణలోకి తీసుకోవాలని, రైతులు, కరెంటు, వ్యవసాయ బంధాన్ని విడదీయలేనిదని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
సమైక్య పాలనలో విద్యుత్ సంక్షోభాన్ని అనుభవించామని, ఆనాడు గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించే ప్రాజెక్టులు కట్టి ఉంటే బాగుండేదని నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలోనే ఆహార ఉత్పత్తి తెలంగాణ నుంచే జరుగుతోందని, 2014 నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మె.వా. ఉండేదని చెప్పారు. 2023 ఆగస్టు నాటికి 18,756 మె.వా. విద్యుత్ సామర్థ్యానికి, విద్యుత్ డిమాండ్ 6666 మె.గా. ఉంటే 15497 మె.గా. కి, తలసరి విద్యుత్ వినియోగం 1,196 నుంచి యూనిట్లకు తీసుకెళ్లామని అన్నారు. అవసరాలకు అనుగుణంగా వివిధ స్థాయిల సబ్ స్టేషన్లు పెంచామని, డిస్కంల సంఖ్యను 2138 నుంచి 3210 కి, పవర్ ట్రాన్స్ ఫార్మర్లను 3272 నుంచి 5690కి, డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ ఫార్మర్లను 46937 నుంచి 8.62 లక్షలకు, వ్యవసాయ కనెక్షన్లు 19 నుంచి 28 లక్షల పై చిలుకుకు తీసుకెళ్లామని నిరంజన్ రెడ్డి తెలిపారు.

