నగర పరిధిలోని ప్రధాన విస్తరణను భారీగా పెంచుతూ హెచ్ఎండీఏ ప్రణాళికను సిద్ధం చేసింది. హబ్సిగూడ మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్ జంక్షన్ మీదుగా నాగోలు మూసీ బ్రిడ్జి వరకు ఉన్న రహదారిని ప్రస్తుతమున్న 30 మీటర్ల నుంచి 60 మీటర్లకు పెంచనున్నారు. ఉప్పల్ రింగు రోడ్డు నుంచి చాదర్ ఘాట్ వరకు ఉన్న రోడ్డును 60 మీటర్ల విస్తరణ చేయనున్నారు.
సిటీబ్యూరో : నగర పరిధిలోని ప్రధాన విస్తరణను భారీగా పెంచుతూ హెచ్హెచ్ఎండీఏ ప్రణాళికను సిద్ధం చేసింది. హబ్సిగూడ మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్ జంక్షన్ మీదుగా నాగోలు మూసీ బ్రిడ్జి వరకు ఉన్న రహదారిని ప్రస్తుతమున్న 30 మీటర్ల నుంచి 60 మీటర్లకు పెంచనున్నారు. ఉప్పల్ రింగు రోడ్డు నుంచి చాదర్ ఘాట్ వరకు ఉన్న రోడ్డును 60 మీటర్ల విస్తరణ చేయనున్నారు.
ఎల్బీ నగర్- బైరామాల్ గూడ, ఐఎస్ సదన్-గగన్ పహాద్, కర్మన్ ఘాట్- చంపాపేట్, ఈసీఐఎల్ నుంచి రాధిక క్రాస్ రోడ్, మాదాపూర్ పీఎస్ నుంచి – హైటెక్ సిటీ జంక్షన్-మాదాపూర్ మెట్రో, ఎన్నగర్ హెచ్-44 నుంచి ఎమ్మెల్యే ఆల్వాల్త్ సర్కిల్ బంజారాహిల్స్ రోడ్ నెం 14-జీవీకే మాల్ – కేబీఆర్ పార్క్ రోడ్ వరకు ఉన్న రోడ్లను విస్తరించేందుకు ఏర్పాట్లు చేశారు.

