– ఆర్డీఓకు బీజేపీ నాయకుల వినతి
కోదా, జూన్ 12 : కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను డ్రాలో కేటాయించిన లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలని బిజెపి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బిజెపి జిల్లా కమిటీ సభ్యుడు జల్లా జనార్ధన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ సూర్యనారాయణను కలిసి వినతిపత్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన రెండున్నర ఏళ్లలో నిర్మించిన ఇళ్లను పేద ప్రజలకు అందజేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు నేడు శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది పేద ప్రజలు ఎండకు ఎండి, వానకు తడుస్తూ దుర్భర జీవితం జీవిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే అర్హులైన ఇండ్లను కేటాయించాలని నిర్ణయించాలి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మునగాల శ్రీనివాస్, చిలుకూరి శ్రీను, గంగిరెడ్డి రాకేష్ రెడ్డి, పైడిమర్రి సతీష్, కనుమర్లపూడి శ్రీహరి, కుడుమురి ఈశ్వరరావు, అనిల్ ఉన్నారు.

