- ఇంతియాజ్ అలీ యాక్షన్ సినిమాల ట్రెండ్ మధ్య ప్రేమకథలపై మాట్లాడారు.
- తనకు, మనస్ఫూర్తిగా నమ్మే కథలనే ఎంపిక చేసుకుంటానని చెప్పారు.
- ప్రేక్షకులు వినోదం కోరుకుంటారు కానీ, వ్యూహాత్మక లెక్కల గురించి ఆలోచించరన్నారు.
- ప్రేమంటే ఏంటో ఇంకా వెతుకుతున్నానని, అది దొరకకూడదని ఆశిస్తానన్నారు.
పురుషాధిక్య చిత్రాల గురించి ఇంతియాజ్ అలీ స్పందన: ఇంతియాజ్ అలీ… బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని నిర్మించుకున్న డైరెక్టర్, రైటర్, నిర్మాత. ఎక్కువగా లవ్ స్టోరీస్, ఎమోషనల్ అంశాలతో కూడిన కథలను తెరకెక్కిస్తూ సంచలన విజయాలు సాధించారు. ప్రస్తుతం యానిమల్, ధురంధర్ వంటి మాస్ యాక్షన్ స్పై థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తున్న తన లవ్ స్టోరీస్‌తో బ్లాక్ బస్టర్స్ సాధించడంపై ఆయన తాజాగా ఏబీపీ కాన్క్లేవ్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘నాకు వేరే ఛాయిస్ లేదు’
ఢిల్లీలో జరిగిన ఏబీపీ నెట్వర్క్ ఇండియా @ 2047 కాన్ క్లేవ్లో ఇంతియాజ్ తన అభిప్రాయాన్ని పంచుకుంది. ధురంధర్, యానిమల్ వంటి యాక్షన్ ట్రెండ్ నడుస్తున్న టైంలో లవ్ స్టోరీస్ విజయవంతంగా ఎలా అభివృద్ధి చెందింది అనే ప్రశ్నకు ఆయన రియాక్ట్ అయ్యారు. ‘నేను ఉద్దేశపూర్వకంగా ట్రెండ్ ఎంచుకోను. నా వద్దకు వచ్చే కథలనే అనుసరిస్తా. మనస్ఫూర్తిగా నమ్మే కథలకే టైం కేటాయించడానికి ఇష్టపడతాను.
నాకు వేరే ఛాయిస్ లేదు. ఒక డైరెక్టర్‌గా మూవీ తీస్తున్నప్పుడు ఒకదానికి రెండేళ్లు కట్టుబడి ఉండాలి. అది చాలా పెద్ద కమిట్మెంట్. నేను చేస్తున్న పనిని నేను ప్రేమించాలి. ఆడియన్స్ ఓ మంచి వినోదాత్మకంగా చూడాలనుకుంటారు. దాని వెనుక వ్యూహాత్మక లెక్కల గురించి ఆలోచించరు. ప్రస్తుతం లవ్ స్టోరీస్ తీయడానికి ఇదే బెస్ట్ టైం అని రీసెంట్గా ఒకరు నాతో అన్నారు.’ అంటూ చెప్పారు.
Also Read : Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? – ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి… ఏబీపీ కాన్క్లేవ్లో మనోజ్ బాజ్‌పేయ్
ప్రేమంటే…
ప్రేమంటే ఏంటి? అని అడిగితే. ‘నాకు తెలిస్తే బాగుండేది. నా చాలా చూపులన్నీ అయిపోతాయి. సినిమాలు తీస్తూ నేను ఇప్పటికీ ప్రేమ నిర్వచనం కోసం వెతుకుతున్నాను. అయితే, దాని అర్థం నేను ఎప్పటికీ కనుగొనకూడదని ఆశిస్తున్నా.’ అని అన్నారు.
‘సోచా నా థా’ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన… జబ్ వి మెట్, లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, లవ్ ఆజ్ కల్, తమాషా, హైవే, అమర్ సింగ్ చకీల మూవీస్ తెరకెక్కించారు. ఇంతియాజ్ తీసే సినిమాలు లవ్ స్టోరీస్, ఎమోషనల్‌గా ఉంటాయి.
Also Read : అమీర్ ఖాన్ : ప్రియురాలితో అమీర్ ఖాన్ వివాహం… పెళ్లి డేట్ ఫిక్స్?
Vizag Town Hall History: స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వైజాగ్ టౌన్ హాల్ చరిత్ర | ABP దేశం

