లివర్ డిటాక్స్ అపోహలు: మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాటి పనులు చేస్తూ ఉంటాయి. వాట నడపగల సామర్థ్యం ఉన్న అవయవాలలో కాలేయం అత్యంత ముఖ్యమైనది.. దీనిని మన శరీరంలో కర్మాగారం అని పిలుస్తుంటారు. హృదయం, స్థాయికి మించి ఇది పనిచేస్తూ ఉంటుంది. కాలేయం గనుక పని చేయకుండా ఉంటే.. శరీరం రోగాల కుప్ప అవుతూ ఉంటుంది. ఏదైనా అవాంతరం ఏర్పడితే పనితీరులో మార్పు వస్తుంది. గుండె పనితీరులో కూడా మార్పు వస్తుంది. కానీ కాలేయం పనితీరులో ఎటువంటి మార్పులు చూపించలేదు. విపరీతమైన సమస్యలు వస్తేనే కాలేయం ఇబ్బంది పడుతూ ఉంటుంది.
కాలేయం ముందుగానే చెప్పినట్టు మన దేహానికి ఒక కర్మాగారం లాంటిది.. బాడీలో ఉన్న చెడు పదార్థాలను మొత్తం శుద్ధి చేస్తుంది. వాటిని తొలగిస్తుంది కూడా. అయితే కొందరు లివర్ ను డిటాక్స్ చేసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అందువల్ల కొన్ని కొన్ని పదార్థాలను తీసుకోవాలని చెబుతారు. ఇక మార్కెట్లో అయితే ఉత్పత్తులను అమ్ముతుంటాయి. వీటిని వాడితే మీ లివర్ డిటాక్స్ అవుతుందని చెబుతాయి. వైద్యుల పరిశోధన ప్రకారం లివర్ డిటాక్స్ అనేది పూర్తిగా అబద్ధం. పైగా ఏ పదార్థం కూడా లివర్ ను డిటాక్స్ చేయదు.
కాలేయం అనేది ఒక రసాయన కర్మాగారం లాంటిది. దీనిని డిటాక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అనేక రకాల పదార్థాలు.. మందులకు సంబంధించిన విషాలను తగ్గిస్తుంది. శరీరం నుంచి వెంటనే తొలగిస్తుంది. పైగా కొవ్వులో కరిగే ఆ విషాలను, నీటిలో కరిగే విధంగా మార్చేస్తూ ఉంటుంది. ఇది కూడా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. మార్కెట్లో లివర్ డిటాక్స్ ఉత్పత్తులు పూర్తిగా అటువంటి యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి. అవి లివర్ ఎంజాయ్ పనితీరును నేరుగా ప్రభావితం చేయగలిగితేనే ఆ స్థాయి ఉంటుంది. డిటాక్స్ ఉత్పత్తులు చెప్పుకునే స్థాయిలో ప్రభావం చూపించలేదు. ఏదో హెర్బల్ టీ తాగినంత మాత్రాన మన లివర్ ఒక్కసారిగా ప్రభావంతంగా మారిపోదు. మరింత గొప్పగా విషాలను హరించలేదు. దీనికంటే ముందు నుంచే వారంలో ఏడు రోజులు.. రోజులో 24 గంటల రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటుంది. అందులో ఉన్న వ్యర్థాలను బయటికి పంపిస్తూనే ఉంటుంది.
ఈ కథనం వివిధ వేదికల వద్ద సేకరించాం. దీనిని వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయంగా చూడకూడదని మా మనవి. కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనాన్ని పబ్లిష్ చేశాం. ఈ పరీక్ష పాఠకులు గమనించాలని కోరుతున్నాం.

