లెనిన్ మూవీ ట్విస్ట్: ఈమధ్య కాలం లో డైరెక్టర్స్ థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేయడం కోసం కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయడానికి భయపడేవారు. ఎందుకంటే అప్పట్లో కమర్షియల్ హంగులకు ఆడియన్స్ బాగా అలవాటు పడ్డారు కాబట్టి. హీరో చనిపోతే అసలు తట్టుకునేవారు కాదు , సినిమాని డిజాస్టర్ చేసేవారు, కేవలం అదొక్కటే కాదు , విచారకరమైన ముగింపుతో వచ్చే ఏ సన్నివేశాన్ని కూడా ఆడియన్స్ తీసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ఆరోజులు పోయాయి , ఇప్పుడంతా జెన్ జీ యుగం. ఇలాంటి సరికొత్త ప్రయోగాలను వాళ్ళు ఒక రేంజ్ లో స్వాగతిస్తున్నారు. మేకర్స్ కి ఫ్రీ హ్యాండ్ దొరికేలోపు , వాళ్ళ ఆలోచలను చాలా స్వేచ్ఛగా వెండితెర పై పెట్టేందుకు ఏ మాత్రం మొహమాటం చూపించడం లేదు. ‘ఉప్పెన’ చిత్రం లోని క్లైమాక్స్ ట్విస్ట్ ప్రతీ ఒక్కరికి పెద్ద షాక్.
ఇలాంటి క్లైమాక్స్ ని టాలీవుడ్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించలేదు. ఇక ‘ఉప్పెన’ ని తెరకెక్కించిన బుచ్చి బాబు , రీసెంట్ గా ‘పెద్ది’ నిర్మించాడు. ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా ఆడియన్స్ కి పెద్ద షాక్. ఒక స్టార్ హీరోని ఇలాంటి ప్రయోగం లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆడియన్స్ ఈ క్లైమాక్స్ ని కూడా స్వీకరించారు. ఇలా ఈ ట్రెండ్ ని ఆడియన్స్ బాగా ఆదరిస్తుండడం తో , మేకర్స్ కూడా ఈ విధంగా మరిన్ని ప్రయోగాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ‘లెనిన్’ చిత్రంలో కూడా అలాంటి ప్రయోగమే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ‘ఏజెంట్’ వంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ద్వారా మురళి కిషోర్ అబ్బూరి అనే నూతన డైరెక్టర్ ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు.
ఈ సినిమా లో హీరో అక్కినేని అఖిల్ కి కళ్ళు పోతాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే కోసం ఆయన తన నేత్రాలను దానం చేస్తాడట, లేటెస్ట్ గా విడుదల చేసిన మూడవ పాటలో కూడా డైరెక్టర్ చిన్న చిన్న సూచనలు ఇచ్చాడు. అక్కినేని అఖిల్ కి నటించడానికి ఫుల్ స్కోప్ ఉన్న పాత్ర ఇది. కంటెంట్ కూడా ఈసారి చాలా బలంగా ఉన్నట్లుగానే అనిపిస్తోంది. విడుదల చేసిన రెండు పాటలకు , టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది , చూస్తుంటే అయ్యగారు ఈసారి గట్టిగానే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా ఉన్నాడు , ఇండస్ట్రీలో ఎప్పటి నుండో , సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్ , ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొడుతాడనే నమ్మకంతో అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారు.

