Lenin Movie : గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక్క సక్సెస్ కోసం అఖిల్ కు ఎట్టకేలకు ‘లెనిన్’ సినిమాతో మంచి విజయం దక్కింది. ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా చేశాడు. ఒక్క సక్సెస్ వస్తే చాలు చాలా మంది స్టార్ డైరెక్టర్లు అతనితో సినిమా చేద్దామని చూస్తున్నారు. ఇక ఇలాంటిదే అఖిల్ తో కొరటాల శివ సైతం ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం బాలయ్య బాబుతో ఆయన సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే అఖిల్ తో సినిమా చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా ఆయన చేయబోయే సినిమాలు కూడా ఇప్పుడు టాప్ హీరోగా నిలబెట్టే విధంగా ఉండాలి. కానీ తన ఇమేజ్ ను డౌన్ చేసే విధంగా ఉండకూడదు. ఇక ఇలాంటిదే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి ముందుకు అడుగులు వేస్తే మంచిదని మరికొంతమంది సినిమా మేధావులు చెబుతున్నారు.
కొరటాల శివ సినిమా అంటే మినిమం గ్యారంటీ మూవీగా ఉంటుంది. కాబట్టి అతనితో సినిమా చేయడం వల్ల అఖిల్ ఇమేజ్ తారా స్థాయికి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయంలో సరైన క్లారిటీ అయితే లేదు. ఇక ఈ గ్యాప్ లో అఖిల్ మరో సినిమా చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది…
వరుసగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధిస్తూ భారీ విజయాలను అందుకుంటూ తనకంటూ ఒక రేంజ్ ను మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళితేనే అఖిల్ టాప్ హీరోగా మారుతాడు. లేకుంటే ఆయన చాలావరకు ఇబ్బందులకు గురిచేసే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఏది ఏమైనా తన తోటి హీరోలందరు సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. కాబట్టి అఖిల్ కూడా వాళ్ళకి పోటీ నిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది…

