జెనీవా చర్చల్లో కీలకంగా మారిన ఇజ్రాయెల్ దాడుల అంశం
హెజ్బొల్లాలకు ఇరాన్ మద్దతు వల్లే సమస్య తలెత్తిందన్న
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్
ఇరాన్‌తో సత్సంబంధాలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన
హర్మూజ్‌లో రవాణా, ఖతార్ నుంచి నిధుల విడుదలపై పట్టుబడుతున్న ఇరాన్
చర్చలు జరుగుతుండగానే ఇరాన్‌కు అధ్యక్షుడు ట్రంప్ ఘాటు హెచ్చరికలు
లెబనాన్‌లో పరోక్ష యుద్ధం ఆపాలని వార్నింగ్
ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో ప్రతినిధులుగా పాల్గొన్న పాక్, ఖతార్ దేశాల ప్రతినిధులు
జెనీవా: జెనీవాలో ఆదివారం ఆరంభమైన ఇరాన్ అమెరికా చర్చలలో ప్రత్యేకించి లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల విషయం ప్రస్తావనకు వచ్చింది. శాంతి ఒప్పందంలో భాగం గా లెబనాన్‌పై దాడి కుదరదని ఇరాన్. అయితే లెబనాన్ మొత్తం పరిస్థితిని తీసుకుని మాట్లాడాలని అమెరికా ఇరాన్‌కు స్పష్టం చేసింది. హెజ్బోల్లా శక్తులకు ఇరాన్ మద్దతుతోనే సమస్య తలెత్తిందని జెడి వాన్స్ తెలిపారు. ఈ వాదన సరికాదని ఇరాన్ ఎదురు వాదనకు దిగింది. ఇ క ఒప్పందంలోని కీలక అంశాల అమలుకు 60 రోజుల కార్యాచరణ గురించి ప్రధానం గా చర్చ జరిగింది. అయితే దీనితో హర్మూజ్ జలసంధి విషయం ముడివడి ఉండటంతో తన పట్టు సాగాలని ఇరాన్ పట్టు పట్టింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారినందున హర్మూజ్ నుంచి రవాణా అంశం ఇరాన్‌తో పాటు అమెరికా కూడా నియంత్రించాల్సి వస్తుందని ట్రంప్ మాటగా వాన్స్ చెప్పినట్లు వెల్లడైంది. అమెరికా చెప్పిన మాటలకు ఇరాన్ పూర్తిగా అంగీకరించడం, కాదనటం అంతా కూడా హర్మూజ్‌పై ఇప్పుడు ఇరాన్‌కు ఏ మేరకు పట్టు ఉందా? అనే అంశంపై ఉంటుంది.
అమెరికా ఉపాధ్యక్షులు జెడి వాన్స్ స్పందన
ఇరాన్ మధ్య జెనీవా చర్చలలో అమెరికా పురోగతి సాధించామని అమెరికా ఉపాధ్యక్షులు జెడి వాన్స్ తెలిపారు.కలిసికట్టుగా ముందుకు సాగి , ఫలితాలు పొందుతామని ప్రకటించారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో అత్యంత కీలకమైన జెనీవా శాంతి చర్చలు రెండురోజుల ఆటంకం తరువాత ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇరాన్, అమెరికా, ఖతార్, పాకిస్థాన్ ప్రతినిధులతో ఈ చతుర్ముఖ స్థాయి సంప్రదింపులు సాగాయి. ఈ చర్చల తొలి దశ ముగిసిందని ఆ తరువాత ఇరాన్ ప్రతినిధి బృందం ప్రదర్శించింది. సంప్రదింపుల గురించి స్పందించలేదు. అయితే అమెరికా ఉపాధ్యక్షులు జెడి వాన్స్ ఈ చర్చల తొలి దఫాపై పూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. బహుముఖ రీతిలో పురోగతి ఉంది. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి శాంతి స్థాపన దిశలో అధ్యక్షుడు ట్రంప్ ఆకాంక్షలు, ఆలోచనలకు అనుగుణంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
అయితే ఏ స్థాయిలో ఏకీభవం కుదిరింది? జటిల రీతిలో ఉన్నవేమిటీ అనే వివరాలను వెల్లడించలేదు. ఈ చర్చలు ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చేస్తుంది. అలాగే ఏండ్ల తరబడి ఇరాన్ అమెరికా మధ్య ఘర్షణ, అపనమ్మకాలు సమసిపోవడానికి వీలేర్పడుతుందని వాన్స్ తెలిపారు. లెబానాప్పై ఇజ్రాయెల్ దాడులతో హర్మూజ్ తిరిగి మూసివేసిన వార్తలు, అమెరికాతో చర్చలపై ఇరాన్ అపనమ్మకాల నేపథ్యంలో తిరిగి ఎట్టకేలకు ఇరుపక్షాల మధ్య సంప్రదింపులు ఆరంభమయ్యాయి.
ఈసారి చర్చలకు పాకిస్థాన్ ప్రధాని షెహజ్ షరీఫ్, ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్హ్మ్రన్ బిజ్ జాసిం అల్ తానీ, ఇరాన్ మాజీ స్పీకర్ బఘెర్ గాలీబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జి. చర్చల ప్రక్రియ ఎన్ని ఆటలు వచ్చినా ముందుకు సాగేలా చేసినందుకు జెడి వాన్స్ పాకిస్థాన్ ప్రధాని షరీఫ్‌కు, సైనికాధినేత సయ్యద్ అసీం మునీర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడి ప్రధాని చర్చలు ఆశాజనకం అని ఖతార్ స్పందించారు. ట్రంప్ చొరవతోనే చర్చలు సాఫీగా సాగుతున్నాయని పాక్ ప్రధాని షరీఫ్ కొనియాడారు. కేవలం ప్రాంతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో శాంతి స్థాపనకు ఈ చర్చలు కీలకం అని షరీఫ్ తెలిపారు. ఇక్కడి చర్చలతోనే అంతా అయిపోలేదని, అయితే కుదిరే శాశ్వత శాంతికి ఇది ఆరంభం అని పాక్ ప్రధాని చెప్పారు.
ఇరాన్‌కు ట్రంప్ ఘాటు హెచ్చరిక
వాషింగ్టన్: లెబనాన్‌లో వెంటనే ఇరాన్ తన ప్రచ్ఛన్న యుద్ధం నిలిపివేయాలి. అక్కడి హెజ్బోల్లాలకు మద్దతు ఇవ్వరాదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ఈ చర్యలను ఆపకపోతే ఇకపై అమెరికా ఇరాన్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడుతుందని ఆదివారం హెచ్చరిక. ఓ వైపు అమెరికా ఉపాధ్యక్షులు వాన్స్ సారధ్యంలో ఇరాన్‌తో కీలక సంప్రదింపులు సాగుతున్న దశలో ట్రంప్ అత్యంత కటువైన స్పందన వెలువడింది. రెండు మూడు రోజుల వాయిదా తరువాత స్విట్టర్లాండ్‌లోని జెనీవా సమీపంలోని రిసార్ట్ గ్రామంలో ఇరుదేశాల ప్రతినిధుల శిఖరాగ్ర సమావేశం. ఒక నెల ఆరంభంలో ఇరుపక్షాల మధ్య కుదిరిన శాంతి స్థాపన ఎంఒయు అమలుకు చర్చలు జోరందుకున్నాయి.
ఇరాన్‌కు తొత్తులుగా హెజ్బోల్లా పనిచేస్తోందని తెలుసు. ఈ శక్తులను ఇరాన్ అదుపులో పెట్టాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. లేకుంటే టెహరాన్ సహా ఇరాన్‌లోని ప్రాంతాలను ధ్వంసం చేయడం తీవ్ర స్థాయిలో ట్రంప్ తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈసారి అమెరికా దెబ్బ ఘాటుగా ఉంటుందని తెలిపారు. లెబనాన్‌లో తెరవెనుక సైనిక చర్యలతో శాంతి స్థాపన వీలుకాదని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ లెబనాన్‌లో భారీ స్థాయిలో నిధులు పంపించి, తన పరోక్ష శక్తులను తయారు చేసింది. ఇది మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో 60 రోజుల్లోనే తుది ఒప్పందం అమలులోకి రావాలి. లేకపోతే హర్మూజ్ పై అమెరికా భారీ సుంకాలు వసూలు చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.

