ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నాను అంటూ టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్న తొలి మహానాడు సందర్భంగా లోకేశ్ చేయబోతున్న ఆ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ కోరికనే తన తాత ఎన్టీఆర్, తండ్రి సీబీఐ బాటలోనే మహిళలకు పెద్దపీట వేసేలా లోకేశ్ ఆ ప్రకటన చేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అయినా కాకపోయినా టీడీపీ మహిళలకు కనీసం 33% సీట్లు రిజర్వ్ చేయాలని తాను ప్రతిపాదిస్తున్నానని అన్నారు. మహిళలకు 33 శాతం సీట్లు టీడీపీ కేటాయించాలని ఈ సభాముఖంగా తీర్మానం చేశామన్నారు.
పార్లమెంటులో ఇటీవల మహిళల రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టారని, ఆ బిల్లులకు ఎన్డీఏ మిత్రపక్షాలలో ఒకటిగా టీడీపీ మద్దతిచ్చిందని లోకేశ్ గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ తో పాటు పార్టీలు ఆ బిల్లులను చేశాయని అన్నారు.
అందుకే, మరోసారి బిల్లు ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పారు. అయితే, అక్కడ బిల్లు పాస్ అయినా కాకున్నా…ఏపీలో మాత్రం టీడీపీ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని తాను ప్రతిపాదిస్తున్నానని అన్నారు.

