- వందే మాతరంను అవమానిస్తే జైలే..
- వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు..
- FCRA సవరణ బిల్లును మరోసారి లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం..
- జనన, మరణాల ఆలస్య నమోదుపై కఠిన నిబంధనలకు మరో బిల్లు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీని ఎన్డీయే సర్కార్ కీలక బిల్లును తీసుకురానుంది. దీనికి సంబంధించిన జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(FCRA) సవరణ బిల్లు-2026, జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు-2026తో పాటు మరణాల నమోదు(సవరణ)బిల్లు-2026ను సభలో ప్రవేశపెట్టనున్నారు.
వీటిలో పాటు ఎంఎస్ఎం డెవలప్మెంట్(సవరణ) బిల్లు-2026, ఇన్కమ్ టాక్స్ (సవరణ) బిల్లు-2026, వికసిత్ భారత్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు-2025ను పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్నారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’, జైలులో ఉన్న ప్రజాప్రతినిధుల అధికారాలపై రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రస్తుతం అజెండాలో లేవు.
వందేమాతరాన్ని అవమానిస్తే జైలే:
జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026 బిల్లు ద్వారా జాతీయ గీతం ”వందేమాతరం” ఆలాపనను అవమానించడం లేదా అడ్డుకోవడాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఇందు కోసం 1971 నాటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టూ నేషనల్ హానర్ యాక్ట్‌లో సవరణ చేయనుంది.
FCRA సవరణ బిల్లు:
వివాదస్పదమైన విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు, 2026ను కూడా పరిశీలన, ఆమోదం కోసం ప్రభుత్వం జాబితాలో చేర్చిందని లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల. ఈ బిల్లును బడ్జెట్ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టారు. కానీ పరిశీలన, ఆమోదం కోసం ముందుకు రాలేదు. ఆ సమయంలో కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, ఆ రాష్ట్రంలోని కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో బిల్లు నిలిచిపోయింది. దీనిని ఇప్పుడు ఆమోదం కోసం ముందుకు తీసుకురాబోతున్నారు.
జనన, మరణాల నమోదు నిబంధనలు కఠినతరం:
జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026 ద్వారా 1969 చట్టంలోని సెక్షన్ 13(3)లో మార్పులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఆలస్యంగా జనాలు, మరణాల నమోదుకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.

