ఐసీఐసీఐ గ్లోబల్ మార్కెట్స్ ఎకనామిక్ రీసెర్చ్
ఇటీవల: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గత జూన్లో 16 శాతం మేర తగ్గడం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సద్దుమణగడం భారత ఆర్థిక రంగానికి సానుకూల సంకేతాలను ఐసిఐసిఐ గ్లోబల్ మార్కెట్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్ తాజా నివేదికలో పేర్కొంది. గత ఆర్ ఐ ఎంపిసి సమావేశం నాటికి బ్యారెల్ ధర 95 డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం వైఎస్-ఇరాన్ శాంతి ఒప్పందాల వల్ల భారీగా తగ్గింది. కీలక ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉండటం, జిడిపి వృద్ధి రేటు 7.8 శాతంతో ఆశాజనకంగా నమోదు కావడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయి. ఆగస్టులో జరగబోయే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ద్రవ్యోల్బణ అంచనాలను ఆర్బిఐ తగ్గించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. చమురు ధరలు బ్యారెల్కు 80-85 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగితే.. వడ్డీ రేట్లను వెంటనే పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అయితే జూన్ నెల ధరల సూచీ (సిపి) ఉనికి, రుతుపవనాల గమనం, అంతర్జాతీయ ఒప్పందాల అమలుపైనే ఆర్బిఐ తుది నిర్ణయంపై నిపుణులు చెబుతున్నారు.
పోస్ట్ వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చు..! మొదట కనిపించింది నవతెలంగాణ.

