టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. హీరో వరుణ్ సందేశ్, ప్రముఖ నటుడు జెమిని సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “బ్లాక్ మెయిల్”. హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై అవినాష్ కూనపరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రానికి శ్రీనివాస్ గుండ్రెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశం మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీనివాస్ తనకు ఎప్పటినుంచో పరిచయమని, ఈ కథ చెప్పగానే ఇందులో ఉన్న పటిష్టమైన కంటెంట్ చూసి వెంటనే ఓకే చెప్పానని అన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని అన్నారు. నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ.. వరుణ్ సందేశంతో కలిసి స్క్రీన్ షేర్ చేయడం సంతోషంగా ఉంది. నిర్మాత అవినాష్ ప్రతి విషయంలో అండగా నిలుస్తున్నారు, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా రూపొందించబడింది. ఈ కార్యక్రమానికి నిర్మాత అవినాష్ కూనపరెడ్డి చేసిన కామెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దాదాపు 200 కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యమే ఆయన సినీ పరిశ్రమలోకి రావడానికి ముఖ్య కారణం. అంతేకాకుండా, ఈ సినిమా ద్వారా వచ్చే లాభాల్లో 10% వాటాను సినిమా కోసం అహర్నిశలు శ్రమించిన టెక్నీషియన్స్‌కు అందిస్తానని, తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

